https://oktelugu.com/

కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తప్పనిసరిగా తీసుకోవాలా..?

గతేడాది నుంచి భారత్ లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టే దిశగా భారత్ లో అడుగులు పడుతున్నాయి. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా దేశంలోని మూడు లక్షల మంది ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారిని, కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోబోయే వారిని అనేక సందేహాలు వెంటాడుతున్నాయి. అయితే వైద్య నిపుణులు వ్యాక్సిన్లకు సంబంధించి కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. Also Read: వాటి వ‌ల్లే క‌రోనా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 19, 2021 / 01:26 PM IST
    Follow us on

    గతేడాది నుంచి భారత్ లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టే దిశగా భారత్ లో అడుగులు పడుతున్నాయి. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా దేశంలోని మూడు లక్షల మంది ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారిని, కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోబోయే వారిని అనేక సందేహాలు వెంటాడుతున్నాయి. అయితే వైద్య నిపుణులు వ్యాక్సిన్లకు సంబంధించి కీలక విషయాలను వెల్లడిస్తున్నారు.

    Also Read: వాటి వ‌ల్లే క‌రోనా వ్యాప్తి.. వాస్తవాలు వెల్లడించిన చైనా శాస్త్రవేత్తలు..?

    క్లినికల్ ట్రయల్స్ పూర్తైన తరువాతే వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చారని వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చాలా తక్కువమందిలో మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని తొలి డోస్ తీసుకున్న తరువాత కొద్దిస్థాయిలో కరోనా నుంచి రక్షణ లభిస్తుందని రెండో డోస్ తీసుకున్న తరువాత మాత్రమే పూర్తిస్థాయిలో రక్షణ లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

    Also Read: నోరు, నాలుకపై ఈ లక్షణాలు ఉన్నాయా.. కరోనా సోకినట్టే..?

    తొలి డోస్ తీసుకున్న వారు రెండో డోస్ ను తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. తొలి డోస్ ప్రభావం శరీరంపై తక్కువ కాలం ఉంటుందని అందువల్ల బూస్టర్ డోస్ కింద రెండో డోస్ ను ఇస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. తొలి డోస్ తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవాలని.. వ్యాక్సిన్ రెండో డోస్ వల్ల 95 శాతం రక్షణ లభిస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    తొలి డోస్ తీసుకున్న తరువాత సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినా రెండో డోస్ తీసుకోవాలని.. రెండో డోస్ తీసుకునే సమయంలో అనారోగ్య సమస్య ఉంటే ఆ సమస్య తగ్గిన తరువాత చికిత్స చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వైరస్ సోకినా ఇన్ఫెక్షన్ రాదని కానీ ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం మాత్రం ఉందంటూ వైద్యులు సూచిస్తున్నారు.