Modi Govt vs Britan: ‘ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించమన్న’ మహాత్మాగాంధీ వారుసులు మనం. నాడు గాంధీ ‘అహింస’ సిద్ధాంతాన్ని పాటించి బ్రిటీష్ వారి చేతిలో తన్నులు తిన్న చరిత్ర మనది. కానీ ఆ పాత భారతం కాదిది.. నవ భారతం.. మోడీ రాజ్యాంగం.. మహాత్ముడు పుట్టిన నేల నుంచే వచ్చిన నరేంద్రమోడీ మాత్రం బ్రిటీష్ వారు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించలేదు. వాళ్ల చెంప చెళ్లుమనిపించాడు..

తాజాగా బ్రిటన్ దేశం భారత్ ఎంత విన్నవించినా వినిపించుకోలేదు. భారత్ లో తయారైన ‘కోవీషీల్డ్’ టీకా వేసుకున్న వారిని 10 రోజులు వారి దేశంలో కఠిన క్వారంటైన్ ఉండేలా నిబంధనలు విధించింది. బ్రిటన్ దేశం తయారు చేసిన కోవీషీల్డ్ వేసుకున్నా కూడా భారతీయులకు ఈ శిక్ష విధించింది. భారత ప్రభుత్వం ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెట్టింది. భారతీయ టీకాలను ఆమోదించలేదు.
దీంతో చిర్రెత్తుకొచ్చిన మోడీ సర్కార్ అంతకు మించిన రివేంజ్ ను ప్లాన్ చేసింది. బ్రిటన్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రతిచర్యలకు దిగింది.బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చే బ్రిటీష్ పౌరులపై మోడీ సర్కార్ సైతం ఇలా కఠిన ఆంక్షలు విధించింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి భారత్ కు వచ్చే బ్రిటన్ పౌరులు 3 కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టులు తప్పనిసరిగా చూపించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ప్రయాణానికి 72 గంటల ముందు, ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత, అనంతరం 8వ రోజులు ఇలా మూడు సార్లు కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏకంగా 10 రోజులు భారత్ లో క్వారంటైన్ లో ఉండడంతోపాటు 3 సార్లు కోవిడ్ టెస్టులు వంటి ఆంక్షలు అమలు చేయాలని స్పష్టం చేసింది. అక్టోబర్ మొదటి వారం నుంచే ఈ నిబంధనలు అమల్లో ఉండనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
బ్రిటన్ పౌరులు వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా? అనే విషయంతో సంబంధం లేకుండా ఆదేశస్థులందరికీ నిబంధనలు పాటించాల్సిందేనని మోడీ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. భారత పౌరులను ఆదేశంలో ఇబ్బంది పెడితే… మన దేశంలో బ్రిటన్ పౌరులకు అంతకుమించిన ట్రీట్ మెంట్ ను రెడీ చేసింది కేంద్రం.
దేశంలో మోడీ సర్కార్ రాకముందే విదేశాలు ఎంత గిల్లినా.. గిచ్చినా.. ఆఖరుకు పాకిస్తాన్ సరిహద్దుల్లో బాంబులు పేల్చినా శాంతి, సహనం అంటూ మన నేతలు మిన్నకుండేవారు. మన నరనరాల్లో ఆ శాంతి మంత్రం నూరిపోశారు. కానీ భారత్ కు మోడీ వచ్చాక గొప్ప ధైర్యం వచ్చిందని.. ఇంతటి తెగింపు భారత ప్రభుత్వంలో ఇంతవరకూ చూడలేదని మేధావులు కొనియాడుతున్నారు. నిజంగానే మోడీ గుండెధైర్యానికి సలాం చేస్తున్నారు.