https://oktelugu.com/

పోసాని కృష్ణమురళి చావు ఎంతో భయంకరంగా ఉంటుందో చూడండి: బండ్ల గణేష్ హెచ్చరిక

‘అరెవో సాంబా.. నా దేవుడిని అంటావా? ఊరుకోను బిడ్డా.. నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా?’ అంటూ మీడియా సాక్షిగా బండ్ల గణేష్ హెచ్చరికలు పంపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దేవుడిగా భావించే బండ్ల గణేష్ ఆయనపై విమర్శలను తట్టుకోలేకపోయాడు. రెండు మూడు రోజులుగా పోసాని వ్యాఖ్యలు వింటూ అగ్నిపర్వతంలా రగిలిపోయాడు. లోపల ఉన్న లావానంతా కక్కేశాడు.  ఈ లావా ధాటికి పోసాని చావు తథ్యం అంటూ శాపనార్థాలు పెట్టాడు. ప్రకాష్ రాజ్ […]

Written By: , Updated On : October 1, 2021 / 08:36 PM IST
Follow us on

‘అరెవో సాంబా.. నా దేవుడిని అంటావా? ఊరుకోను బిడ్డా.. నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా?’ అంటూ మీడియా సాక్షిగా బండ్ల గణేష్ హెచ్చరికలు పంపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దేవుడిగా భావించే బండ్ల గణేష్ ఆయనపై విమర్శలను తట్టుకోలేకపోయాడు. రెండు మూడు రోజులుగా పోసాని వ్యాఖ్యలు వింటూ అగ్నిపర్వతంలా రగిలిపోయాడు. లోపల ఉన్న లావానంతా కక్కేశాడు.  ఈ లావా ధాటికి పోసాని చావు తథ్యం అంటూ శాపనార్థాలు పెట్టాడు. ప్రకాష్ రాజ్ ఎదురుగా ‘మా’ ఎన్నికల పంచాయతీలో మాట్లాడిన బండ్ల గణేష్ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో పెనుసంచలనమయ్యాయి.

ప్రముఖ న్యూస్ చానెల్ లైవ్ లో ప్రకాష్ రాజ్ తో కలిసి పాల్గొన్న బండ్ల గణేష్ ఈ సందర్భంగా నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోసాని ఒక ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ లాంటివాడని అన్నారు. ‘మా’ ఎన్నికల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించిన బండ్ల గణేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మా’ ఎన్నికల్లో నిలబడ్డ మంచు విష్ణు.. ‘పవన్ కు ఇండస్ట్రీతో సంబంధం లేదన్నట్టు మాట్లాడాడు. ఆయన ఇండస్ట్రీ మనిషే కాదు అని మాట్లాడడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. నేను ఇచ్చిన హామీ మీద ఇంకా నిలబడే ఉన్నాను. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మద్దతిస్తున్నాను’ అని బండ్ల గణేష్ ‘మా’ ఎన్నికల బరి నుంచి వైదొలిగి ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మద్దతిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కేవలం తను దైవంగా కొలిచే పవన్ కళ్యాణ్ ను మంచు విష్ణు అవమానించినందుకే బండ్ల గణేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక పోసాని రెండు రోజులుగా పవన్ ను తిట్టడంపై బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు. ‘పోసాని ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ లాంటి వాడని’ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తల్లి గురించి మాట్లాడి పోసాని పెద్ద తప్పు చేశాడు.. ఆ వ్యాఖ్యలన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.. ఈ తల్లి వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో లక్షల మంది కుటుంబాలు బతుకుతున్నారు. ఆ ఆడబిడ్డల గురించి పోసాని మాట్లాడి తప్పు చేశారని బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు.

పోసాని భార్య నా తల్లిలాంటిందని.. ఆయన్ను భరిస్తున్న ఆమెకు పాదాభివందనం చేస్తున్నానని బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలతో హోరెత్తించారు. పోసాని గురించి మాట్లాడితే నా స్థాయి తగ్గించుకున్న వాడిని అవుతానని.. సభ్య సమాజం ఆయన్ను అసహ్యించుకుంటోందన్నారు. పవన్ ను తిట్టండి.. అంతేకానీ ఆయన తల్లిని.. ఇతర ఆడవాళ్ల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని బండ్ల గణేష్ తీవ్ర విమర్శలు చేశారు. పోసాని కుక్క చావు చస్తాడని బండ్ల గణేష్ ఆరోపించారు.

పోసాని చావు చాలా భయంకరంగా ఉంటుంది - Bandla Ganesh on Posani Krishna Murali - TV9