‘నాకు కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది..’ అంటూ సినిమా డైలాగ్‌లు విసిరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రియల్ లైఫ్‌లోనూ అలాంటి డైలాగ్‌లనే విసురుతున్నారు. ప్రతీ ఎన్నికకు ముందు ఏదో ఒక డైలాగ్ చెబుతూ ఆ ఎన్నిక నుంచి తప్పుకోవడమో.. లేక మరో పార్టీకి మద్దతు పలకడమో చేస్తున్నారు. అయితే.. తిరుపతి లోక్‌సభ స్థానం వంతు వచ్చింది. మరి ఇక్కడ పోటీపై పవన్ ఏ లెక్కలు చెబుతారా అనేది ఆసక్తి నెలకొంది.
Also Read: ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్..!
తిరుపతి ఉప ఎన్నిక ఫిబ్రవరి లేదా మార్చిలో ఉండొచ్చనేది సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. రోజురోజుకూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండురోజుల తిరుపతి పర్యటన కోసం జనసేనాని పవన్‌కల్యాణ్ నేటి సాయంత్రం తిరుపతి చేరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. అలాగే రేపు ఉదయం 11 గంటలకు మీడియా మీట్ నిర్వహిస్తారు. పవన్ పర్యటన నేపథ్యంలో జనసేన -బీజేపీ కూటమి అభ్యర్థిపై స్పష్టత వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. బీజేపీ కూడా ఆ సీటును విడిచిపెట్టేది లేదంటూ చెప్పుకొస్తోంది. బరిలో నిలిచేందుకు క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లనూ సిద్ధం చేసుకుంటోంది. కమిటీలను కూడా ఎంపిక చేసే పనిలో బీజేపీ నేతలు నిమగ్నమయ్యారు. అయితే.. పవన్‌కల్యాణ్ ఆరంభశూరత్వం గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో ఆయన ఏదో అంటారని, ఆ తర్వాత తమ నేతలు మాట్లాడితే మెత్తబడతారని బీజేపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. గతంలో కూడా అమరావతి పర్యటనలో పవన్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. చివరికి ఎలా సైడ్ అయిపోయారో కూడా అందరికీ తెలిసిందే.
Also Read: ఆ చానళ్ల ‘తప్పు’టడుగులు..: రేటింగ్ పెంచుకునేందుకు భారీ కుట్ర
గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తానన్న పవన్‌కల్యాణ్‌ను బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ వెళ్లి కలవగానే అంతా తుస్సుమని పించారు. తగిన సమయం లేకపోవడంతో పాటు కమ్యునికేషన్ గ్యాప్ కారణంగా పొత్తు పెట్టుకోలేకపోయామని పవన్ నాడు చెప్పారు. ప్రధానంగా హైదరాబాద్‌లో బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందని, అందుకే తమ కార్యకర్తలకు ఇష్టంలేకపోయినా జీహెచ్ఎంసీ బరి నుంచి తప్పుకుంటున్నామని పవన్ చెప్పడాన్ని నేడు బీజేపీ నేతలు, కార్యకర్తలు తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో గుర్తు చేయడం విశేషం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్