https://oktelugu.com/

నెలకు రూ.లక్ష పెన్షన్ పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

మనలో ప్రతి ఒక్కరికీ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చు. రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం కావాలని భావించే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. చేతిలో ఉన్న డబ్బుతో మరింత ఆదాయం పొందాలని భావించే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. Also Read: ఆల్ టైం రికార్డుకి సెన్సెక్స్.. దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 21, 2021 / 12:17 PM IST
    Follow us on


    మనలో ప్రతి ఒక్కరికీ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చు. రిటైర్మెంట్ తర్వాత స్థిర ఆదాయం కావాలని భావించే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. చేతిలో ఉన్న డబ్బుతో మరింత ఆదాయం పొందాలని భావించే వాళ్లకు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

    Also Read: ఆల్ టైం రికార్డుకి సెన్సెక్స్.. దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

    ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు చిన్న వయస్సులోనే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడితే మంచిదని చెబుతున్నారు. షార్ట్ టర్మ్ ఇన్‌కమ్ ఫండ్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో కూడా ఎక్కువ ఆదాయాన్ని సులభంగా పొందవచ్చు. భారీ మొత్తంలో డబ్బులు ఉన్నవాళ్లు ఇలాంటి స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నవారు ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయవక్ఛు.

    Also Read: ఆదాయపు పన్ను చెల్లించే వాళ్లకు కేంద్రం శుభవార్త చెప్పనుందా..?

    ఈ స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రెగ్యులర్ ఆదాయం కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఏబీఎస్ఎల్ షార్ట్ టర్మ్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ షార్ట్ టర్మ్ ఇన్‌కమ్ ఫండ్, కోటక్ ఈక్విటీ సేవింగ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా అదిరిపోయే రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే అంత త్వరగా ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

    మరిన్ని వార్తల కోసం: వ్యాపారము

    త్వరగా డబ్బు సంపాదించాలని యోచించే వారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ తో కూడుకున్నవి కాబట్టి కొన్ని సందర్భాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ పై పూర్తి అవగాహన ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది.