https://oktelugu.com/

తన ప్రియుడు పై పెళ్లి పై హీరోయిన్ ముచ్చట్లు !

హీరోయిన్ తాప్సీ మొత్తానికి కంగనా పై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ త‌క్కువ కాలంలోనే తనకు తానూ ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ లో. అక్కడి హీరోయిన్ల‌లో తాప్సీ కూడా ఇప్పుడు మెయిన్ అనే పరిస్థితి కనిపిస్తోంది. మొద‌ట టాలీవుడ్‌లో స‌త్తా చూపిన ఈ ముద్దు గుమ్మ,‌ మొత్తానికి పాన్ ఇండియా బ్యూటీ అనిపించుకుంది. ఇక చాలాకాలంగా తాప్సీ డేటింగ్ లో ఉందనే విషయం రహస్యమేమీ కాదు, అంత ఓపెన్ గానే ప్రేమ వ్యవహారాలను నడిపిస్తుంటుంది ఈ హాట్ భామ. […]

Written By:
  • admin
  • , Updated On : January 21, 2021 / 12:40 PM IST
    Follow us on


    హీరోయిన్ తాప్సీ మొత్తానికి కంగనా పై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ త‌క్కువ కాలంలోనే తనకు తానూ ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ లో. అక్కడి హీరోయిన్ల‌లో తాప్సీ కూడా ఇప్పుడు మెయిన్ అనే పరిస్థితి కనిపిస్తోంది. మొద‌ట టాలీవుడ్‌లో స‌త్తా చూపిన ఈ ముద్దు గుమ్మ,‌ మొత్తానికి పాన్ ఇండియా బ్యూటీ అనిపించుకుంది. ఇక చాలాకాలంగా తాప్సీ డేటింగ్ లో ఉందనే విషయం రహస్యమేమీ కాదు, అంత ఓపెన్ గానే ప్రేమ వ్యవహారాలను నడిపిస్తుంటుంది ఈ హాట్ భామ. ఇంటర్ నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మతియాస్ ఆమె ప్రియుడు. ఆ మధ్య మతియాస్ తో కలిసి మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.

    Also Read: బయటపడ్డ యాంకర్ ప్రదీప్ మరో కోణం !

    కాగా తాజాగా తాప్సి త‌న పెళ్లి సంగ‌తుల గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ‘రష్మీ రాకెట్’ చిత్రీక‌ర‌ణ‌లో బీజీగా ఉన్న ఆమె, ఆ సినిమాలో అథ్లెట్‌గా న‌టిస్తోంది. పెజెంట్ వ్యాయామం పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిందట. ఇక ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న తాప్సీ త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డిస్తూ.. “మతియాస్ నాకు దగ్గరివాడు. అందులో దాచుకునేదేమి లేదు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ వేర్వేరుగా ఉండాలి అనేది నా పాలసీ. అందుకే హీరోలతో, సినిమా రంగానికి చెందిన వారితో ఎప్పుడూ డేటింగ్ కి వెళ్ళలేదు” అని ప్రేమ గురించి తెలిపింది.

    Also Read: దూసుకుపోతున్న రామ్ ‘రెడ్’.. మిగిలిన భాషల్లోకి కూడా !

    మరి పెళ్లి తర్వాత నటిస్తారా అని అడిగితే, “ఎస్. .పెళ్లి తర్వాత ఇప్పుడు చేస్తున్న స్పీడ్ గా సినిమాలు చెయ్యను. ఏడాదికి ఒకటి, రెండు మాత్రం ఒప్పుకుంటా.” అని అంది, ఇంతకీ పెళ్లి ఎప్పుడు అంటే.. ‘ఇండ‌స్ట్రీలో కెరీర్ ‌పరంగా సాధించాల్సిన క‌ల‌లెన్నో ఉన్నాయ‌ట. వాటిని నెర‌వేర్చుకోవ‌డం పైనే త‌న ఆలోచ‌న‌ల‌న్నీ ఉన్నాయని.. తానెప్పుడైతే ఆశించిన స్థాయికి చేరుకున్నాన‌ని భావిస్తానో, అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తాన‌ని ఈ భామ మొత్తం మీద తేల్చి చెప్పింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్