https://oktelugu.com/

తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి దర్శనం

తిరుమల తిరుపతి దేవస్థానం సాధారణ భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు గురువారం నుంచి అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5.0లో దేవాలయాల్లో దర్శనానికి అనుమతి ఇవ్వడంతో, రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్ లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోని దేవాలయాల్లో దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక షరతులతో అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో టిటిడి తొలి మూడు రోజులు దేవస్థానం ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించింది. రోజుకు ఏడూ వేల మంది భక్తులకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 11, 2020 / 12:55 PM IST
    Follow us on


    తిరుమల తిరుపతి దేవస్థానం సాధారణ భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు గురువారం నుంచి అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5.0లో దేవాలయాల్లో దర్శనానికి అనుమతి ఇవ్వడంతో, రాష్ట్రంలో కంటైన్మెంట్ జోన్ లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోని దేవాలయాల్లో దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక షరతులతో అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో టిటిడి తొలి మూడు రోజులు దేవస్థానం ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించింది. రోజుకు ఏడూ వేల మంది భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తామని టిటిడి ప్రకటించింది. గురువారం మూడు వేల మందికి ప్రత్యేక దర్శనం, మారో మూడు వేల మందికి టైమ్ స్లాట్ టిక్కెట్లను విక్రయించారు. అలిపిరి తొలిగేట్ వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి కొండపైకి టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. లేని వారిని వెనక్కి పంపిస్తున్నారు. గంట పాటు విఐపిలకు దర్శనం కల్పించేందుకు టిటిడి అధికారులు అవకాశం కల్పించారు. దర్శనం కోసం వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. అదేవిధంగా సామాజిక దూరం పాటించాలి, కేవలం దర్శనాలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రత్యేక కైకర్యాలు ఏమీ ఉండవు.

    ఆన్ లైన్ లో టిక్కెట్ లు బుక్ చేసుకోలేని వారి కోసం తిరుపతిలోని అలిపిరిలోని బాలాజీ లింక్ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణునివాసం ప్రాంతాల్లో దర్శన సమయ టోకెన్లను జారీ చేస్తున్నారు. స్థానికులు పెద్ద సంఖ్యలో టోకెన్ జారీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ నెల 15 నుంచి 17 వరకూ టోకెన్లను ఈ రోజు టిక్కెట్ విక్రయ కేంద్రాల వద్ద విక్రయిస్తున్నారు. అలిపిరి లింక్ బస్టాండ్ లో భక్తులను టీటీడీ సిబ్బంది దూరదూరంగా కూర్చోబెట్టారు. శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన టోకెన్ సెంటర్ నుంచి డీబీఆర్ హాస్పిటల్ వరకూ క్యూ లైన్ కనిపించింది. కరోనా వైరస్ ను సైతం లెక్కచేయకుండా స్వామివారి దర్శనానికి భక్తులు పోటీ పడుతున్నారు.