https://oktelugu.com/

రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న టిక్ టాక్..?

చైనాకు చెందిన ప్రముఖ యాప్ టిక్ టాక్ ను భారత్ నిషేధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ యాప్ తిరిగి భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సర్వశక్తులను ఒడ్డుతోంది. ప్రధానంగా చట్టపరంగా ఉన్న అవకాశాలపై దృష్టిసారించింది. న్యాయపరంగా తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు భారత్ లోని ప్రముఖ న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తోంది. మరోవైపు కేంద్రంతో కూడా టిక్ టాక్ యాజమాన్యం తమకు అవకాశం ఇవ్వాలని కోరుతోంది. దీనిపై కేంద్రం తాము ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలేమని తేల్చిచెప్పింది. అనుమతి కావాలంటే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 3, 2020 / 11:46 AM IST
    Follow us on


    చైనాకు చెందిన ప్రముఖ యాప్ టిక్ టాక్ ను భారత్ నిషేధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ యాప్ తిరిగి భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సర్వశక్తులను ఒడ్డుతోంది. ప్రధానంగా చట్టపరంగా ఉన్న అవకాశాలపై దృష్టిసారించింది. న్యాయపరంగా తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈమేరకు భారత్ లోని ప్రముఖ న్యాయవాదులతో సంప్రదింపులు చేస్తోంది. మరోవైపు కేంద్రంతో కూడా టిక్ టాక్ యాజమాన్యం తమకు అవకాశం ఇవ్వాలని కోరుతోంది. దీనిపై కేంద్రం తాము ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలేమని తేల్చిచెప్పింది. అనుమతి కావాలంటే కోర్టులో తేల్చుకోండని చెప్పడంతో టిక్ టాక్ ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.

    చివరకు రఘురామ కృష్ణం రాజు సాధించింది ఏమిటీ?

    సరిహద్దుల్లో భారత జవాన్లపై దొంగదెబ్బ తీసిన చైనాకు తగిన గుణపాఠం చెప్పాలని కేంద్రం భావిస్తోంది. భారత్ జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చైనాకు రుచిచూపించేందుకు మోడీ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా చైనాను రక్షణ, ఆర్థిక, దౌత్యపరంగా దెబ్బకొట్టేందుకు వ్యూహాన్ని రచించింది. ఇందులో భాగంగానే చైనాకు చెందిన కంపెనీల కాంట్రాక్టులను కేంద్రం రద్దుచేసింది. అదేవిధంగా 59యాప్స్ ను ఇటీవల భారత్ లో నిషేధించింది. దీంతో చైనాలో చలనం మొదలైంది. భారత్ లో చైనా యాప్స్ నిషేధం, కాంట్రాక్టుల రద్దుతో ఆ దేశానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లనుంది.

    భారత్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ తో చైనా నానయాగీ చేస్తోంది. భారత్ అంతర్జాతీయ సూత్రాలను కాలారాస్తుందంటూ ప్రచారం చేసుకుంటోంది. చైనా యాప్స్ నిషేధించాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెబుతోంది. అంతర్జాతీయ నియమవళి ప్రకారం తమ ఉత్పత్తులను భారత్ లోకి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీనికి కేంద్రం కూడా దీటుగానే సమాధానం ఇస్తోంది. సరిహద్దు నియమావళిని ఉల్లంఘించి భారత్ భూభాగాల్లోకి వచ్చినపుడే చైనాకు అంతర్జాతీయ నియమాలు గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నిస్తుంది. దొంగదెబ్బతో భారత జవాన్లు మృతికి కారణమైనపుడు గుర్తుకురాని నియమవాళి చైనాకు ఆర్థిక నష్టం వస్తుందనే సరికి గుర్తుకొచ్చాయా? అంటూ ప్రశ్నిస్తోంది.

    బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!

    మరోవైపు భారత్ లో నిషేధానికి గురైన టిక్ టాక్ ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు చేస్తోంది. తమ రీ ఎంట్రీకి అవకాశం ఇవ్వాలని టిక్ టాక్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తోంది. కేంద్రం మాత్రం న్యాయస్థానంలో తేల్చుకోవాలని సూచించింది. దీంతో టిక్ టాక్ యాజమాన్యం సుప్రీం కోర్టులో తమ వాదనలు విన్పించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ని టిక్ టాక్ యాజమాన్యం సంప్రదించగా కేంద్రానికి వ్యతిరేకంగా.. చైనాకు అనుకూలంగా న్యాయస్థానంలో తాను వాదించలేని చెప్పినట్లు సమాచారం. దీంతో తమ వాదనలు వినిపించేందుకు మరో న్యాయవాదిని వెతికే పనిలో టిక్ టాక్ పడింది.

    గతంలోనూ కేంద్రం టిక్ టాక్ ను బ్యాన్ చేస్తే సుప్రీంలో పోరాడి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా భారత్-చైనా ఉద్రిక్తతల పరిస్థితుల్లో నేపథ్యంలో టిక్ టాక్ సహా 59చైనా యాప్స్ పై కేంద్రం బ్యాన్ విధించింది. భారతీయుల సమాచారాన్ని ఈ యాప్స్ చైనాకు చేరవేస్తున్నాయనే కారణంతో కేంద్రం వీటిని నిషేధించింది. దీంతో తాము ఎలాంటి సమాచారాన్ని చైనాకు అందజేయాలని టిక్ టాక్ తాజాగా ప్రకటించింది. దీనిపై చట్టపరంగా పోరాడేందుకు సిద్ధమవుతోంది.

    మద్యం ప్రియులకు ముచ్చెమటలు పట్టించిన న్యూస్ ఇదే..!

    అయితే టిక్ టాక్ తరుఫున వాదించేందుకు న్యాయవాదులు ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. టిక్ టాక్ ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలడం యాజమాన్యం తలలు పట్టుకుంటోంది. అయితే భారత్ లోని తమ ఉద్యోగులు, యాజర్లకు మాత్రం తాము త్వరలోనే రీ ఎంట్రీ ఇస్తామంటూ భరోసా కల్పిస్తుంది. అయితే టిక్ టాక్ భారత్ లోకి ఎలా రీ ఎంట్రీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.