https://oktelugu.com/

ఆ మంత్రికి చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్న తుమ్మల, నామా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఉంది. అందుకు తగ్గట్టుగానే రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ ముందుకెళుతుంటారు. ఇటీవల కాలంలో బద్ధశత్రువులు నేతలంతా ఒకే పార్టీలో చేరడం.. వ్యతిరేక పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు చేరి ఎన్నికల్లో పోటీ చేయడం లాంటివి చూస్తూనే ఉన్నాం. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి సంఘటన జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు బద్ధశత్రువులుగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు, నామా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 12, 2020 / 07:29 PM IST
    Follow us on


    రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఉంది. అందుకు తగ్గట్టుగానే రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ ముందుకెళుతుంటారు. ఇటీవల కాలంలో బద్ధశత్రువులు నేతలంతా ఒకే పార్టీలో చేరడం.. వ్యతిరేక పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకు చేరి ఎన్నికల్లో పోటీ చేయడం లాంటివి చూస్తూనే ఉన్నాం. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి సంఘటన జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు బద్ధశత్రువులుగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు, నామా నాగేశ్వర్ రావుల మధ్య తాజాగా సయోధ్య కుదరిందని టాక్ విన్పిస్తుంది. దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

    Also Read: కరోనా ఎఫెక్ట్.. ప్రైవేట్ అంబులెన్సుల అడ్డగోలు దందా

    తుమ్మల, నామాలు టీడీపీలో ఉన్నప్పటి నుంచి వీరి మధ్య ఆధిపత్య కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో తుమ్మల హవా కొనసాగుతున్న సమయంలోనే నాడు చంద్రబాబు నామాకు ప్రాధాన్యం ఇవ్వడంతో టీడీపీ వర్గపోరు మొదలైంది. 2004లో వీరిద్దరు ఒకరిని ఓడించేందుకు ఒకరు ప్రయత్నం చేయడంతో ఆ ఎన్నికల్లో వీరిద్దరు ఓటమి పాలయ్యారు. 2009లో వీరిద్దరు గెలిచిన టీడీపీ అధికారంలోకి రాలేదు. మళ్లీ 2014లో వీరిద్దరు ఒకరిని ఓడించేందుకు మరికొరు ప్రయత్నం చేసుకున్నారు. దీంతో ఖమ్మం ఎమ్మెల్యేగా తుమ్మల.. ఎంపీగా నామ నాగేశ్వర్ రావులు ఓడిపోయారు. అనుహ్యంగా తుమ్మల నాగేశ్వర్ రావు టీఆర్ఎస్ చేరి మంత్రి పదవీ దక్కించుకొని జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు.

    ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వర్ రావు ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ లోని గ్రూపు రాజకీయాలే ఆయన ఓటమి కారణమని తెలుస్తోంది. అలాగే ఆ ఎన్నికల్లో నామా మహాకూటమి అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే పార్లమెంట్ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరి ఎంపీగా గెలుపొందారు. అయితే ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈ నేతలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన పువ్వాడ అజ‌య్‌కుమార్ కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి అయిన ఖమ్మం రాజకీయాలను శాసిస్తున్నారు. తమపై అజయ్ పెత్తనం చేస్తుండటంతో ఈ ఇద్దరు నేతలు మంత్రి చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ టీఆర్ఎస్ వర్గాల్లో విన్పిస్తోంది.

    Also Read: అమ్మా దొంగ.. కేసీఆర్, జగన్ మాస్టర్ ప్లానేనా?

    ఇటీవల కాలంలో వీరిద్దరు నేతలు ఒకరికొకరు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల నామా తుమ్మల వద్ద వెళ్లి పరామర్శించడంతోపాటు తన కంపెనీలో తయారైన శానిటైజర్లను కూడా ఆయన అందజేశారని వినికిడి. ఖమ్మంలో మంత్రి అజయ్ హవాకు చెక్ పెట్టేందుకు వీరిద్దరు కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారట. జిల్లాలోని కీలక పదవులన్నీ మంత్రి అజయ్ వర్గానికి చెందిన నేతలే వస్తుందటంతో వీరిద్దరు ఒక్కటవుతున్నారు. మంత్రి అజయ్ కు జిల్లాలో గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట.

    మరోవైపు మంత్రి అజయ్ సైతం ఈ ఇద్దరు నేతల కలయికపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారట. వీరి వ్యూహాలకు ప్రతీవ్యూహాలను అజయ్ సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం గులాబీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. టీఆర్ఎస్ నేతల ఆధిపత్య పోరు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే..!