వైసిపి లో మొదటి వికెట్ డౌన్..! జగనే సస్పెండ్ చేశాడు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో ఏకగ్రీవంగా అధికారాన్ని చేపట్టిన తర్వాత అందరి ఆలోచనలు ఒకటే. ఇప్పటివరకూ ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సమర్థవంతంగా అవినీతిరహితంగా నడిపించగలడా లేదా అని. అయితే ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం పై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా వాటికి ఎక్కడా రుజువు లేదు. ప్రతిపక్షాలు కొంతమంది, అధికార పార్టీ అంటే గిట్టనివాళ్లు చేసిన ఆరోపణలు మినహాయించి పెద్దగా […]

Written By: Navya, Updated On : August 12, 2020 6:49 pm
Follow us on

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో ఏకగ్రీవంగా అధికారాన్ని చేపట్టిన తర్వాత అందరి ఆలోచనలు ఒకటే. ఇప్పటివరకూ ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సమర్థవంతంగా అవినీతిరహితంగా నడిపించగలడా లేదా అని. అయితే ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం పై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా వాటికి ఎక్కడా రుజువు లేదు. ప్రతిపక్షాలు కొంతమంది, అధికార పార్టీ అంటే గిట్టనివాళ్లు చేసిన ఆరోపణలు మినహాయించి పెద్దగా స్థాయిలో అవినీతి కుంభకోణం బయటకు రాకపోవడం విశేషం.

 

అయితే ఇప్పుడు వైసిపి సీనియర్ నాయకుడు… ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ మాజీ చైర్మన్ కోయ ప్రసాద్ రెడ్డి ని బుధవారం భూసేకరణ కబ్జా ఆరోపణలపై పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ముందుగా ప్రసాద్ రెడ్డి పై చాలా పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వైసిపి క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపింది. అనంతరం ప్రసాద్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు వేసింది. విశాఖపట్నం కు చెందిన ప్రసాద్ రెడ్డి ని వైసిపి పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేరును విశాఖ నగరంలో కొన్ని ఒప్పందాలను పరిష్కరించడంలో విశాఖపట్నం కలెక్టర్ వద్ద దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే కేవలం ప్రసాద్ రెడ్డి ని సస్పెండ్ చేస్తే చాలదని విపక్షాల వాదన. పార్టీలో ఉంటూ అధికార దర్పంతో అక్రమాలు చేసే నాయకుల పేర్లు ఒకటి బయటకు రావాలని.. ప్రసాద్ రెడ్డి కేవలం పావు మాత్రమేనని…. అతని వెనక ఇంకా వైసీపీ లీడర్లు ముఖానికి మంచోళ్ళలా మాస్క్ వేసుకొని తిరుగుతున్నారని వైసిపి వ్యతిరేక దాడులు వాదిస్తున్నారు.

కేవలం ప్రసాద్ రెడ్డి ని సస్పెండ్ చేసి ఈ కోటింగ్ ఇచ్చే బదులు ఈ కుంభకోణం వెనుక అసలైన ఆధారాలు, తెరచాటు వ్యవహారాలు, మనుషులు, లెక్కలు అన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక డేరింగ్ స్టెప్ వేసిన జగన్ మళ్లీ వారి కోరికను తీర్చగలడా…?