నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం(World Elephant Day). ప్రకృతిలో ఏనుగుల అవశ్యతను వివరించేందుకు ఈ డేను ప్రతీయేటా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఏనుగులు అంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా ఏనుగును మేధస్సుకు చిహ్నంగా.. వినాయకుడికి ప్రతీరూపంగా పూజిస్తుంటారు. పలు దేవాలయాల్లో నిర్వహించే ఉత్సవాల్లో ఏనుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ముఖ్యంగా కేరళలో ఏనుగులు ఎక్కువగా కన్పిస్తుంటాయి. మనదేశంతోపాటు చాలాదేశాల్లో ఏనుగుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.
Also Read: కరోనా ఎఫెక్ట్.. ప్రైవేట్ అంబులెన్సుల అడ్డగోలు దందా
World Elephant Dayను పురస్కరించుకొని హైదరాబాద్లోని నెహ్రూ జూపార్కులో వేడుకలను నిర్వహించారు. ఈ జూ పార్కులో మొత్తం ఐదు ఏనుగులు ఉన్నాయి. వీటిలో ఒక మగ ఏనుగు, నాలుగు ఆడ ఏనుగులు ఉన్నాయి. ఈ ఐదు ఏనుగుల్లో రాణి అనే ఏనుగు వయస్సు 82 అని జూ అధికారులు తెలిపారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏనుగు పేర్లతో ప్రత్యేకంగా రాగిపిండి, బియ్యం పిండితో కేకులను తయారు చేయించారు. ఈ కేకులతోపాటుగా వాటికి ఇష్టమైన చెరకు, బెల్లం, పైనాపిల్, మొక్కజొన్న, కొబ్బరి, పచ్చిగడ్డి వంటి వాటిని ఆహారంగా అందించారు.
Also Read: అమ్మా దొంగ.. కేసీఆర్, జగన్ మాస్టర్ ప్లానేనా?
నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఏనుగులన్నీ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. వీటికి రోజు వాటి ఇన్ చార్జిలు, అధికారుల సమక్షంలోనే రోజు ఆహారం అందిస్తున్నారు. ఈ జూలో సూజీ అనే చింపాజీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని వయస్సు 33. ఇటీవల సూజీ 34వ పుట్టిన రోజును జూ అధికారులు ఘనంగాచేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ప్రపంచ ఏనుగుల దినోత్సవం పురస్కరించుకొని ఏనుగులతో కేక్ కట్ చేయడంపై పలువురు వారెవ్వా అంటూ కామెంట్లు చేస్తున్నారు.