అయితే ఈ రోజు ఉన్నట్టు ఉండి అమీర్ – కిరణ్ విడాకులకు కారణం ఓ యంగ్ హీరోయిన్ అంటూ హాఠాత్తుగా ‘ఫాతిమా సనా షేక్’ పేరు తెర మీదకు వచ్చింది. నిజానికి ఫాతిమా అమీర్ తో చాల క్లోజ్ గా ఉంటుంది. అందుకే రికార్డు స్థాయిలో ఆమె పేరు హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు చేస్తూ నెటిజన్లు తమ అక్కసును వెళ్లగక్కారు. మరి ఇంతకీ అమీర్ ఖాన్‌తో ఫాతిమాకు ఎఫైర్ ఉందా ?
ఫాతిమా కోసమే అమీర్ దంపతులు విడిపోతున్నారా ? అసలు 29 ఏళ్ల ఫాతిమా.. 56 ఏళ్ల అమీర్ తో ఎలా సంబంధం పెట్టుకుంటుంది ? మరోపక్క ఫాతిమాకి అమీర్ కి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు అని, వరుసగా రెండు సినిమాల్లో కలిసి నటించడం వల్లే.. ఇద్దరు సన్నిహితంగా ఉన్నారని అమీర్ అభిమానులు వివరణ ఇస్తున్నారు.
అయితే ఈ వార్తల పై ఫాతిమా స్పందిస్తూ.. నాకు ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు నా పర్సనల్ విషయాల గురించి తప్పుగా రాయడం సరికాదు అని చెప్పుకొచ్చింది తప్ప.. వస్తోన్న పుకార్లల్లో వాస్తవం లేదని ఖండించలేదు. ఏది ఏమైనా ఫాతిమాతో అమీర్ కు సంబంధం అంటగట్టడం, యాంటీ ఫ్యాన్స్ నిర్వహమే అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇంతకీ ఈ ‘ఫాతిమా సనా షేక్’ది మన హైదరాబాదే. పైగా ఈ బ్యూటీ ‘నువ్వు నేను ఒకటవుదాం’ అనే తెలుగు సినిమాతోనే వెండితెరకు పరిచయం అయింది. ఆ తరువాత ఫాతిమా 2016లో అమీర్ ఖాన్ ‘దంగల్’లో అమీర్ కూతురిగా మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ వెంటనే థగ్స్ ఆఫ్ హిందోస్థాన్‌లో అమీర్ కి జోడిగా నటించి మెప్పించింది.