Padma Shri Award To Garikapati Narasimharao: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 128 మందికి పద్మ అవార్డులు లభించాయి. నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఉన్నారు. సాహిత్యం, విద్య విభాగం నుంచి ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావుకు, కళలు విభాగం నుంచి గోసవీడు షేక్ హుస్సేన్ (మరణానంతరం)కు, మెడిసిన్ విభాగం నుంచి డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావుకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.
ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు.. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులు. ఆయన అవధానంలో విశేషమైన గుర్తింపు పొందారు కూడా. సాహిత్య విభాగం నుంచి ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. సరళంగా అవధానాన్ని ఓ ఉపన్యాసం మాదిరిగా ఈ తరానికి అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పడం గరికపాటి వారి స్పెషాలిటీ అని చెప్పొచ్చు. ప్రతీ రోజు ఉదయాన్నే టీవీలో కనబడుతుంటారు గరికపాటి. ఇకపోతే ఆయన ఉపన్యాసాలను అందరూ వినడానికి సిద్ధంగా ఉంటారు. అలా గరికపాటి వారికి చాలా మంది అభిమానులే ఉన్నారు. ఆయనకు పద్మ శ్రీ అవార్డు లభించడం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఏపీలోని పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్ పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు 1958 సెప్టెంబర్ 14న జన్మించారు. గరికిపాటు ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసిన గరికపాటి వారు..సుమారు 30 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా పని చేశారు.
Also Read: పద్మభూషణ్ అవార్డును బుద్ధదేవ్ భట్టాచార్య ఎందుకు తిరస్కరించారు?
నరసింహారావు తన ఇద్దరు కుమారులకు ప్రముఖ రచయితలైన శ్రీశ్రీ,, గురజాడ పేర్లు పెట్టారు. అలా పేర్ల ద్వారా తనకు సాహిత్యంపైన ఉన్న అభిలాషను తెలిపారు. విదేశాల్లోనూ గరికపాటి అవధానాలు చేశారు. గొప్ప ఉపన్యాసకర్తగా పేరు గాంచిన గరికపాటి.. పద్య కావ్యాలు, పాటలను కూడా పుస్తకాలుగా ప్రచురించారు. ‘ప్రవచన కిరీటి’, ‘ధారణా బ్రహ్మ రాక్షసుడు’ , ‘అమెరికా అవధాన భారతి’, ‘సహస్రభారతి’, ‘అవధాన శారద’, ‘శతావధాన గీష్పతి’, ‘శతావధాన కళా ప్రపూర్ణ’ వంటి బిరుదాలను ఆయనకు ఇచ్చారు.
హిందూ దేవాలయంలో ఆస్థాన విద్వాంసులుగా సేవలందించిన గోసవీడు షేక్ హసన్ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. అటువంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించిందని చెప్పొచ్చు. అయితే, ఈ పురస్కారం షేక్ హసన్‌కు మరణానంతరం లభించింది. భద్రాచలం దేవాలయం ఆస్థాన విద్వాంసులుగా నాదస్వర కళాకారులు దివంగత గోసవీడు షేక్ హసన్ సేవలందించారు. వైద్య విభాగంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు, పోలియో నిర్మూలన మిషన్‌లో కీలకంగా వ్యవహరిస్తూ పేదలకు వైద్యం అందించే డాక్టర్ సుంకర ఆదినారాయణరావుకు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. అలా ప్రవచనకారుడికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన విద్వాంసుడికి, పేదల కోసం పని చేస్తున్న వైద్యుడికి ముగ్గురికి అత్యున్నత పురస్కారాలు లభించాయి.
Also Read: విరిసిన మన ‘పద్మాలు’: సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ ల సక్సెస్ స్టోరీ తెలుసా..?
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Three andhra pradesh people got padma shri award including garikapati narasimharao
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com