Homeఎంటర్టైన్మెంట్Jr NTR Rejected Movies: జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు.. అవి...

Jr NTR Rejected Movies: జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు.. అవి గనక చేసుంటే..?

Jr NTR Rejected Movies: జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ ఎన్నో మంచి సినిమాలు చేశాడు. నందమూరి కుటుంబం బ్యాగ్ రౌండ్ సపోర్టు గట్టిగా ఉన్నా తనును తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎన్టీఆర్ ఎంతో శ్రమించాడు. బాలరామాయణం సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన తారక్ తొలిసినిమా నిన్ను చూడాలని పెద్దగా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1 మూవీతో తొలి విజయాన్ని అందుకున్నాడు.

Jr.Ntr Rejected Movies
Jr.Ntr Rejected Movies

కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ చాలా బొద్దుగా ఉండేవారు. అయినా కూడా డ్యాన్స్ లో ఇరగదీశేవాడు. కారణం తారక్ చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకోవడం వల్లే సాధ్యమైందని అప్పట్లో సినీ వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ తన కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకున్నారు. తనకు తొలిహిట్ ఇచ్చిన రాజమౌళితోనే ఏకంగా మరో రెండు హిట్స్ అందుకుని ప్రస్తుతం మరో హిట్ కోసం (ఆర్ఆర్ఆర్) కోసం ఎదురుచూస్తున్నాడు.

Also Read: Junior NTR: జూనియ‌ర్ ఎన్టీఆర్ కు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా..?

ఇదిలాఉండగా, ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో రిజెక్ట్ చేసిన సినిమాలు చాలా పెద్ద హిట్‌ను అందుకున్నాయి. వాటిని ఎందుకు రిజెక్ట్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.. ‘ఆర్య-1’ సినిమాను సుకుమార్ ముందుగా తారక్ తో తీయాలనుకున్నాడట.. ఈ స్టోరీ చెప్పగా.. తాను బొద్దుగా ఉన్నానని సెట్ అవ్వవని అనడంతో బన్నీ చేసి తన కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్నాడు.

#1) దిల్ 

Understand and buy dil telugu cinema> OFF-50%

#2 ‘భద్ర’

Prime Video: Bhadra

#3 ‘కిక్’

kick Movie

అదే విధంగా వివి వినాయక్ దర్శకత్వంలో ‘దిల్’, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ‘అతనొక్కడే’,బోయపాటి తీసిన ‘భద్ర’, మరోసారి వివి వినాయక్ తీసిన ‘కృష్ణ’, సురేందర్ రెడ్డి తీసిన ‘కిక్’, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘ఎవడు’, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’, మరోసారి వంశీ పైడిపల్లి తీసిన ‘ఊపిరి’, శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిన ‘బ్రహ్మోత్సవం’వంటి సినిమాలన్నీ తారక్ కాదనుకున్నాకే వేరే హీరోలతో తీసి దర్శకులు హిట్ అందుకున్నారు..

Also Read: షాకింగ్ : మెగాస్టార్ కి కరోనా పాజిటివ్ !

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular