https://oktelugu.com/

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు వేల రూపాయాలు.. ప్రలోభాలు షురూ..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసింది. ప్రత్యక్ష పలుకరింపునకు తెర పడింది. ఇక ఓటర్లను ఆకట్టుకునే పనిలో పార్టీలు, అభ్యర్థలు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా ప్రధాన్యత సంపాదించాలని ప్రలోభాలకు తెర లేపుతున్నారు. నగదు, మద్యం, స్వీట్లు, క్రికెటు కిట్లు, చివరికి మేకపోతులు… కూడా పంపిణీ చేస్తూ.. ఓటర్లపై వల విసురుతున్నారు. కొన్నిచోట్ల నాయకులు సంఘాల నేతలతో మాట్లాడి గంపగుత్తగా ఓటర్ల మద్దతు కూడ గట్టుకునే పనిలో పడ్డారు. Also Read: ముగిసిన ప్రచారం.. మొదలైన […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 13, 2021 / 10:50 AM IST
    Follow us on

    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసింది. ప్రత్యక్ష పలుకరింపునకు తెర పడింది. ఇక ఓటర్లను ఆకట్టుకునే పనిలో పార్టీలు, అభ్యర్థలు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా ప్రధాన్యత సంపాదించాలని ప్రలోభాలకు తెర లేపుతున్నారు. నగదు, మద్యం, స్వీట్లు, క్రికెటు కిట్లు, చివరికి మేకపోతులు… కూడా పంపిణీ చేస్తూ.. ఓటర్లపై వల విసురుతున్నారు. కొన్నిచోట్ల నాయకులు సంఘాల నేతలతో మాట్లాడి గంపగుత్తగా ఓటర్ల మద్దతు కూడ గట్టుకునే పనిలో పడ్డారు.

    Also Read: ముగిసిన ప్రచారం.. మొదలైన పలుకరింపు

    ఈ రకంగా శుక్రవారం నుంచే పంపిణీలు మొదయ్యాయి. పేరుకు ఎమ్మెల్సీ ఎన్నికలు అయినా… కొందరు అభ్యర్థులు సాధారణ ఎన్నికలల్లో చేసిన విధంగానే ఖర్చుకు వెనకాడడం లేదు. ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులు భారీగా తడిపేస్తున్నారు. ఒ పార్టీ అభ్యర్థి ఏకంగా రూ.35 కోట్లు ఖర్చు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సమావేశాలకు భారీగానే వెచ్చించిన నేతలు ఓటర్లకు పంపిణీ చేసే క్రమంలో మరింత ఖర్చునకు సిద్ధం అవుతున్నారు.

    Also Read: బండి ధీమా.. కేసీఆర్ ను అలా ఏడిపిస్తాడట!?

    ఆదివారం పోలింగ్ ఉండడంతో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడం.. తమకే ఓటేసేలా చూడడంపై అభ్యర్థులు, పార్టీలు దృష్టి సారించాయి. నల్లగొండ, వరంగల్, ఖమ్మం, ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 5.05 లక్షల ఓటర్లు ఉంటే.. 71మంది అభ్యర్థులు ఉన్నారు. హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 5.31 లక్షల మంది ఓటర్లు ఉంటే.. 93 మంది అభ్యర్థలు బరిలో దిగారు. ఈ నేపథ్యంలో కొందరు స్వతంత్రులు కూడా గట్టిగానే పోటీని ఇస్తున్నారు. దీంతో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఒక్కో ఓటుకు కనీసం వెయ్యినుంచి రూ.3వేల వరకు పలుకుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఇప్పటికే కుల సంఘాలు , ఇతర సంఘాలతో పార్టీలు, విందులు నడిపించారు. ఇప్పుడు నేరుగా ఓటర్లను బుట్టలో వేసుకునే పనిలో పడ్డారు. బూత్ ల వారీగా.. కార్యకర్తలను ఇన్చార్జీలుగా నియమించారు. ఓటర్లలో అనుకూలంగా ఉన్నవారు.. తటస్థంగా ఉన్నారు… స్థానికులు.. ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు.. ఇలాంటి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే వివరాలు సేకరించిన కొందరు శనివారం నుంచి నగదును ఆన్ లైన్ లో చెల్లించే పనిలో పడ్డారు. ఏది ఏమైనా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికల కన్నా.. ఎక్కువగానే ఉత్కంఠను రేపుతున్నాయి.