https://oktelugu.com/

ముగిసిన ప్రచారం.. మొదలైన పలుకరింపు

వాగ్దానాలు.. విమర్శలు.. పరామర్శల నడుమ సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రచారం జోరుగా సాగడం విశేషం. హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్, వరంగల్.. నల్గొండ.. ఖమ్మం.. పట్టభద్రుల స్థానాలకు ఆదివారం రోజున పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచి నాయకులు , అభ్యర్థులు పత్యేక వ్యూహాల అమలులో లీనమయ్యారు. ఓటర్లను వివిధ రూపాల్లో సంప్రదిస్తున్నారు. Also Read: ఏపీపై కేటీఆర్ ప్రేమ.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 13, 2021 / 10:38 AM IST
    Follow us on


    వాగ్దానాలు.. విమర్శలు.. పరామర్శల నడుమ సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రచారం జోరుగా సాగడం విశేషం. హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్, వరంగల్.. నల్గొండ.. ఖమ్మం.. పట్టభద్రుల స్థానాలకు ఆదివారం రోజున పోలింగ్ జరగనుంది. ప్రచారం ముగిసిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచి నాయకులు , అభ్యర్థులు పత్యేక వ్యూహాల అమలులో లీనమయ్యారు. ఓటర్లను వివిధ రూపాల్లో సంప్రదిస్తున్నారు.

    Also Read: ఏపీపై కేటీఆర్ ప్రేమ.. రేపు తమ మెడకు చుట్టుకుంటుందనేనా?

    ఫోన్లలో మాట్లాడుతూ.. తమకే ప్రధాన్యం కల్పించాలని కోరుతున్నారు. పలువురు స్వతంత్రులు కూడా ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగించారు. వీరిలో కొందరు మూడు నాలుగు నెలల నుంచి ప్రచారం చేయడం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి(టీఆర్ఎస్), రాంచందర్రావు(బీజేపీ) పాటు సురభి వాణిదేవి(టీఆర్ఎస్), ప్రేమేందర్ రెడ్డి(బీజేపీ), ఎల్ .రమణ( టీడీపీ), కోదండరాం(తెలంగాణ జన సమితి), జయసారథి రెడ్డి(వామపక్షాలు), చెరుకు సుధాకర్( తెలంగాణ ఇంటిపార్టీ), స్వాతంత్ర్యులుగా మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమ తదితరులు పోటీలో ఉన్నారు.

    Also Read: బండి ధీమా.. కేసీఆర్ ను అలా ఏడిపిస్తాడట!?

    ఎమెల్సీ ఎన్నికలను పార్టీల నుంచి అభ్యర్థుల వరకు చాలా చాలెంజ్ గా తీసుకున్నారు. అభ్యర్థలు ఎంపిక నుంచి ప్రచారం వరకు పార్టీలు ప్రత్యేక శ్రద్ధను చూపాయి. 20 రోజులకు పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల ముఖ్యనేతలంతా.. ప్రచారంలో నిమగ్నమయ్యారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    టీఆర్ఎస్ బీజేపీకి చెరో సిట్టింగ్ స్థానం ఉండగా.. ఈసారి రెండు పార్టీలు రెండింటిని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగించాయి. ఒటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రభుత్వం, ప్రయివేటు ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులతో సభలు, సమావేశాలు నిర్వహించారు. కుల సంఘాలు.. వివిధ వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ, నిరుద్యోగ భృతి, ఎన్నికల హామీలు, విభజన హామీలు, పెట్రో ధరలు, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఇలా అనేక అంశాలు ఎన్నికల ప్రచారంలో భాగమయ్యాయి.