https://oktelugu.com/

ఆ.. ఇద్దరి తొందరపాటు.. రాజకీయ జీవితంపై పోటు..?

కష్టకాలంలో ఉన్న సమయంలో ఎంత గొప్ప త్యాగాలు చేసినా.. అవి ఎన్నటికీ గుర్తింపును ఇవ్వవు. అధికారంలో లేని సమయంలో పార్టీని నడిపించిన నేతలకు ఎప్పటికీ మంచిపేరు లభించదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలే తెలంగాణ.. ఏపీ రాజకీయాల్లో చాలా చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకనేతగా ఉన్న ప్రస్తుత రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందరుపై కొంతకాలంగా పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఒక్కరి సొంతం కాదన్న ఆయన వ్యాఖ్యలకు నిన్నకాక […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 11, 2021 / 02:59 PM IST
    Follow us on


    కష్టకాలంలో ఉన్న సమయంలో ఎంత గొప్ప త్యాగాలు చేసినా.. అవి ఎన్నటికీ గుర్తింపును ఇవ్వవు. అధికారంలో లేని సమయంలో పార్టీని నడిపించిన నేతలకు ఎప్పటికీ మంచిపేరు లభించదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలే తెలంగాణ.. ఏపీ రాజకీయాల్లో చాలా చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకనేతగా ఉన్న ప్రస్తుత రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందరుపై కొంతకాలంగా పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఒక్కరి సొంతం కాదన్న ఆయన వ్యాఖ్యలకు నిన్నకాక మొన్న గులాబీ కండువా కప్పుకున్న కొంతమంది కౌంటర్లు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే పరిస్థితి ఇప్పుడు ఏపీలోనూ నెలకొంటోంది.

    Also Read: ఆ.. ఇద్దరి తొందరపాటు.. రాజకీయ జీవితంపై పోటు..?

    సీఎం అయితే జగన్ కన్నా తానే గొప్పగా రాజకీయం చేస్తానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించుకోవడం.. ఇప్పుడు ఆయనకు వైసీపీలో కష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు మద్దతుగా ఎంపీ రాఘురామకృష్ణంరాజు మట్లాడారు. జగన్ జైలుకు వెళితే.. ఆయనకే సీఎంగా మద్దతు ఉన్నట్లుగా మాట్లాడారు. బయటకు ఎవరూ ఈ అంశంపై మాట్లాడకపోయినప్పటికీ.. వైసీపీలో అంతర్గతంగా జోరుగా చర్చలు చోటు చేసుకుంటున్నాయి. పెద్దిరెడ్డి ఏదో ఫ్లోలో తాను సీఎం అయితే.. అని మాట్లాడి ఉంటే.. పెద్దగా చర్చ ఉండేది కాదు..

    కానీ.. ఆయనపై కొంతకాలంగా వైసీపీలో రకరకాలు ప్రచారాలు ఉన్నాయి. జగన్ జైలుకెళ్లే.. అవకాశం ఉందని.. అందుకోసమే.. వైసీపీలోనే వర్గాన్ని పెంచుకుంటున్నారని.. ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సీమ జిల్లాలతో పాటు తాను ఇన్చార్జీగా ఉన్న జిల్లాలు.. చుట్టుపక్కల జిల్లాలల్లో చాలా మందికి వైసీపీలో పొలిటికల్ గాడ్ ఫాదర్గా వ్యవహరిస్తున్నాని అంటున్నారు. ఇలా అందరితోనూ ఓ వర్గాన్ని వ్యూహాత్మకంగా పెంచుకుంటున్నారని వైసీపీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు నేరుగా ఆయన నోటివెంట నుంచే తాను సీఎం అన్న మాట బయటకు వచ్చింది.

    Also Read: ఉక్కు వెనుక కేంద్రం తుక్కు నిర్ణయం

    ఇంతవరకు వచ్చిన తరువాత సీఎం జగన్ పెద్దిరెడ్డిపై సైలెంట్ గా ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. ఉన్నపళంగా ఆయన్ను గెంటేయకపోవచ్చు కానీ.. మెల్లిగా ప్రధాన్యత తగ్గించే అవకాశాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగాన్ని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నారు. తాను చేయాలనుకున్నది చేసేస్తున్నారు. అందుకే ఆయనకు చెక్ పెట్టడానికి వైసీపీలో రూట్ మ్యాపు రెడీ అయి ఉండే ఉంటుందని పలువురు అంటున్నారు. టీఆర్ఎస్ లో నేతగా ఉన్న ఈటల రాజేందర్.. అక్కడ నాయకత్వ మార్పు జరిగితే.. రేసులో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. దాంతో ఆయన్ను దాదాపు పక్కన పెట్టేశారు. అలాంటి పరిస్థితే.. వైసీపీలో పెద్దిరెడ్డికి ఏర్పడడం ఖాయమనే చర్చ జరుగుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్