సీనియర్ లీడర్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాఖా కుప్పంలో పార్టీ పరిస్థితి రోజురోజుకూ అదుపు తప్పుతున్నట్లుగా కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఆ పార్టీ తట్టుకోలేకపోతోంది. ఇప్పుడు అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. కుప్పంలో అధికార పార్టీ దౌర్జన్యాలు, విచ్చలవిడిగా డబ్బుల పంపిణీతో ప్రజాస్వామ్యాన్ని ఓడించారని టీడీపీ అధినేత చంద్రబాబు పైకి ఎన్ని మాటలు చెప్పినా.. క్షేత్రస్థాయిలో వాస్తవాలంటో కార్యకర్తలకు తెలిసినవే.
Also Read: ఆ ఆరుగురే ఎమ్మెల్సీ అభ్యర్థులు.. జగన్ డిసైడ్?
కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఓటమి తర్వాత.. దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు చంద్రబాబు సవ్యంగా అక్కడికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కుప్పంలో మూడు రోజుల చంద్రబాబు పర్యటన అలాగే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల ఓటమిపై సమీక్షించేందుకు నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారితోపాటు కార్యకర్తలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మునిరత్నం, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పీఏ మనోహర్ హాజరయ్యారు.
ఈ సమావేశంలో త్రిమూర్తులుగా పిలుచుకునే మనోహర్, గౌనివారి శ్రీనివాసులు, మునిరత్నంపై సర్పంచ్ అభ్యర్థులతోపాటు కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ ఓటమికి మీ ముగ్గురి తీరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దగ్గర తగిన ఆర్థిక వనరులు లేవని, సర్పంచ్ బరిలో నిలబడలేమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా నిలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము భూములు కొదవ పెట్టడంతో పాటు అప్పుల పాలు కావాల్సి వచ్చిందని గోడు వెల్లబోసుకున్నారు.
Also Read: మున్సి‘పోల్’కు ముందే పరిషత్ పోరు..: జగన్ ఆలోచన అదేనా..?
పార్టీ నుంచి ఆర్థిక సాయం పక్కనపెడితే కనీసం ప్రచారానికి కూడా ఒక్క లీడర్ రాలేదని నిరసన తెలిపారు. ఇలాగైతే పార్టీ బాగుపడేదెట్లా అని ప్రశ్నించారు. పార్టీ కోసం తామెందుకు అండగా నిలబడాలని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, కోట్లాది రూపాయలు డబ్బు సంపాదించి, కష్టకాలంలో ఏ మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. ముఖ్యంగా గుడుపల్లె, శాంతిపురం మండలాల నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీఎస్ మునిరత్నం, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పీఏ మనోహర్ వ్యవహార శైలిపై మండిపడ్డారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్