ఏపీలో అభ్యర్థి బరిపై అధికారుల దౌర్జన్యం

ఏపీలో అధికార పార్టీ బెదిరింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీకి చెందిన చోటామోటా నేతల నుంచి బడా లీడర్ల వరకు బెదిరింపు రాజకీయాలకు పాల్పడినట్లు ఆరోపణలు జోరుగా వినిపించాయి. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థిని ఏదో ఒకరకంగా బెదిరించి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా చేయడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు, ఏపీ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ బెదిరింపు రాజకీయాలు కేవలం పంచాయతీ ఎన్నికలకే పరిమితం కాకుండా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతున్నయి. […]

Written By: Srinivas, Updated On : February 28, 2021 2:03 pm
Follow us on


ఏపీలో అధికార పార్టీ బెదిరింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీకి చెందిన చోటామోటా నేతల నుంచి బడా లీడర్ల వరకు బెదిరింపు రాజకీయాలకు పాల్పడినట్లు ఆరోపణలు జోరుగా వినిపించాయి. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థిని ఏదో ఒకరకంగా బెదిరించి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా చేయడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు, ఏపీ అధికారులు వ్యవహరిస్తున్నారు.

ఈ బెదిరింపు రాజకీయాలు కేవలం పంచాయతీ ఎన్నికలకే పరిమితం కాకుండా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతున్నయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి ఊపు మీద ఉన్న వైపీసీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని అనుకుంటోంది. ఇందుకు ప్రత్యక్షంగా రంగంలోకి దిగకుండా వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసిన వారిపై ప్రభుత్వ అధికారులతో దాడులకు దిగుతోంది.

Also Read: అచ్చెన్నకు మరో భారీ పంచ్..

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు పట్టణాల్లో కొన్నిచోట్ల రాజకీయ పార్టీల మధ్య చిచ్చు పెడుతున్నాయి. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతలకు , అల్లర్లకు దారి తీస్తున్నాయి. తాజాగా తిరుపతిలో పీజీఆర్ థియేటర్ పక్కన ఉన్న టీ దుకాణంపై నగరపాలక సంస్థ సిబ్బంది దాడులు నిర్వహించారు. దుకాణం అక్రమ నిర్మాణం అన్న అధికారులు… దాన్ని కూల్చి వేస్తామని దుకాణంలోని సామగ్రిని రోడ్డుపై పడేశారు.

Also Read: భారీ డైలాగులు.. పనిచేయనికి వ్యూహాలు..

జేసీబీతో దుకాణం కూల్చివేసేందుకు యత్నించారు. థియేటర్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకే ఖాళీ చేయిస్తున్నామని అధికారులు వివరించారు. అయితే తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని థియేటర్ నిర్వాహకులు మున్సిపల్ అధికారుల తీరుపై ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న దుకాణం నిర్వాహకుడు ఆర్పీ శ్రీనివాస్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

నగరపాలక సంస్థ ఎన్నికల్లో 43వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ అభ్యర్థిగా తన భార్య లక్మ్షీదేవీ నామినేషన్ వేసిందని చెప్పారు.నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని కొన్నరోజులుగా కొందరు తనపై ఒత్తడి తీసుకువస్తున్నారి అన్నారు. ఒత్తడికి తలొగ్గక పోవడంతోనే ఇలా తనకు జీవనాధారమైన దుకాణాన్ని కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కూల్చివేతకు సంబంధించిన పత్రాలు కూడా అధికారుల వద్ద లేవని అన్నారు. బెదిరింపుల ప్రక్రియలో భాగంగానే ఇలాంటి దాడులు చేస్తున్నారని అన్నారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్థానిక టీడీపీ లీడర్ నర్సింహయాదవ్ భరోసానిచ్చారు.