Bipin Rawat: భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం తెలిసిందే. ఐఎం-17వీ5 హెలికాప్టర్ కూలిపోయి సుమారు 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ భద్రతపై అధికారులు శ్రద్ధ తీసుకున్నారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 రష్యా నుంచి కొనుగోలు చేసింది. దేశంలోని ప్రముఖుల కోసం వినియోగించే దీన్ని ప్రధాని లాంటి వారికి కూడా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హెలికాప్టర్ భద్రతపై ఎలాంటి సందేహాలు లేవని తెలుస్తోంది. కానీ సాంకేతిక, వాతావరణ సమస్యలతోనే అది కూలిపోయిందనే విషయాలు నిపుణులు వెల్లడిస్తున్నారు.
అడవులు, సముద్ర జలాలు, ఎడారులపై సురక్షితంగా ప్రయాణించగల హెలికాప్టర్ కావడంతో దీని మన్నికలో ఎలాంటి భయాలు అక్కరలేదు. 4.5టన్నుల బరువును కూడా సునాయాసంగా తరలించే సత్తా గల హెలికాప్టర్ కావడం తెలిసిందే. దీంతో సైనిక చర్యల్లో కూడా దీన్ని వినియోగిస్తారు. బాలాకోట్ దాడుల్లో కూడా దీన్ని వాడినట్లు వాయుసేన ప్రకటించింది.
Also Read: Army Helicopter: బిపిన్ రావత్ హెలిక్యాప్టర్ ప్రమాదంపై విచారణకు ఆదేశం.. కొనసాగుతున్న ఉత్కంఠ.!
దీనికి ప్రత్యేకమైన రక్షణ కవచాలు అమర్చి ఉంటాయి. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నా తప్పించుకునే విధంగా ఏర్పాట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యలో బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సమయంలో ఇవి కూడా పనిచేయలేదోమోననే సందేహాలు వస్తున్నాయి. కానీహెలికాప్టర్ భద్రత విషయంలో మాత్రం ఎలాంటి సందేహాలకు తావు లేదని వాయుసేన వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Crashing Army Helicopter: కూప్పకూలిన ఆర్మీ పెద్ద హెలికాప్టర్.. కాసేపట్లో కేంద్రం కీలక ప్రకటన?