Bheemla Nayak: పవన్ భీమ్లానాయక్ లో త్రివిక్రమ్ మార్క్.. ఆయన చేసిన మార్పులివే..

Bheemla Nayak: మూడేళ్ల సినీ ‘అజ్ఞాతవాసం’ తర్వాత పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’గా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలకు ఓకే చెప్పారు. ఈ క్రమంలోనే మూవీల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘భీమ్లానాయక్’ ఒకటి. కాగా, ఇది మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్. ఇందులో ఒరిజినల్ కథకు, తెలుగు నేటివిటీకి తగ్గట్లు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న మార్పులపై ఫోకస్.. మాటల […]

Written By: Neelambaram, Updated On : December 8, 2021 6:12 pm
Follow us on

Bheemla Nayak: మూడేళ్ల సినీ ‘అజ్ఞాతవాసం’ తర్వాత పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’గా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలకు ఓకే చెప్పారు. ఈ క్రమంలోనే మూవీల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘భీమ్లానాయక్’ ఒకటి. కాగా, ఇది మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్. ఇందులో ఒరిజినల్ కథకు, తెలుగు నేటివిటీకి తగ్గట్లు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న మార్పులపై ఫోకస్..

Bheemla Nayak

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య ఉన్న స్నేహం గురించి సినీ అభిమానులందరికీ తెలుసు. వీరిరువురి మధ్య స్నేహం ‘గోకులంలో సీత’ సినిమా నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత కాలంలో వీరు చేసిన మొదటి సినిమా ‘జల్సా’. దీని తర్వాత ‘అత్తారింటికి దారేది’ ఫిల్మ్ చేశారు. ఇక ‘తీన్‌మార్’ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందించారు.

ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ సినిమా చేశారు. అయితే, ‘తీన్‌మార్, అజ్ఞాతవాసి’ సినిమాలు బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ సంగతులు పక్కనబెడితే.. త్రివిక్రమ్ మరోసారి పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తున్నారు. అదే ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాకు దర్శకుడిగా కాకుండా స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో ప్రధానమైన మార్పులు కొన్ని చేసి అందులో త్రివిక్రమ్ మార్క్ కనబడేలా చేసినట్లు తెలుస్తోంది.

ఒరిజినల్ మలయాళం సినిమా మల్టీస్టారర్ బిజుమీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలు సేమ్ టు సేమ్ ఉంటాయి. అనగా ఫిల్మ్‌లో రోల్స్ ప్రయారిటీ ఇద్దరికీ సమానంగా ఉంటుంది. ఓ డబ్బున్న పర్సన్ ఆహం, హానెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఆత్మగౌరవం మధ్య జరిగే పోరు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా. అయితే, ఇదే చిత్రం తెలుగులోకి వచ్చేసరికి మాత్రం మారిపోయింది. ఇది పూర్తిగా పవన్ సినిమా అయిపోయింది. మల్టీ స్టారర్ మూవీలాగా లేదు. దగ్గుబాటి రానా పాత్ర ఉన్నప్పటికీ ప్రమోషన్స్‌లో ఆయన పేరు అంతగా లేదు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు జరిగిన మార్పు అది.

Also Read: Pushpa Movie: “పుష్ప” మూవీ యూనిట్ కి గోల్డ్ రింగ్ లు కానుకగా ఇచ్చిన బన్నీ…

కాగా, ఇంకా కొన్ని మార్పులున్నాయి. అవేంటంటే..పవన్ కల్యాణ్, నిత్యామీనన్ మధ్య రొమాన్స్ ప్లస్ లవ్ ట్రాక్. ఒరిజినల్ పిక్చర్‌లో ఇది అంతగా లేదు. కానీ, ఇందులో ఉండబోతుంది. ఇక ఒరిజినల్‌లో ఉన్నట్లు ఎమోషనల్ సీన్స్, సీరియస్‌నెస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ సెపరేట్ కామెడీ ట్రాక్ ఉండబోతుంది. బ్రహ్మానందం కోసం సెపరేట్ ఎపిసోడ్స్ ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ‘భీమ్లానాయక్’లో మార్పులు అయితే జరిగినట్లున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్స్‌లో విడుదల కానుంది.

Also Read: Bhola Shankar: ఫుల్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి “భోళా శంకర్” మూవీ…

Tags