https://oktelugu.com/

Megastar Chiranjeevi: భిన్నంగా స్పీడ్ పెంచిన మెగాస్టార్ !

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో చేతిలో నాలుగు సినిమాలు ఉండ‌డం, పైగా ఆ 4 సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి వెళ్లడం, ఇక చిరు కూడా నాలుగు సినిమాలను మ్యానేజ్ చేస్తూ.. అన్నీ సినిమాలకు షూటింగ్ డేట్స్ ను కేటాయించడం నిజంగా విశేషమే. ఒక విధంగా ఇది రికార్డే. మరి ఆ రికార్డుకు కారణం.. మెగాస్టార్ సినిమాల ప్లానింగే. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్‌ చిత్రాల షూటింగ్ లో […]

Written By:
  • Shiva
  • , Updated On : December 8, 2021 / 06:34 PM IST
    Follow us on

    Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో చేతిలో నాలుగు సినిమాలు ఉండ‌డం, పైగా ఆ 4 సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి వెళ్లడం, ఇక చిరు కూడా నాలుగు సినిమాలను మ్యానేజ్ చేస్తూ.. అన్నీ సినిమాలకు షూటింగ్ డేట్స్ ను కేటాయించడం నిజంగా విశేషమే. ఒక విధంగా ఇది రికార్డే. మరి ఆ రికార్డుకు కారణం.. మెగాస్టార్ సినిమాల ప్లానింగే.

    Chiranjeevi

    ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్‌ చిత్రాల షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ రెండు సినిమాలు గత కొన్ని రోజులుగా హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. ఇక రేపటి నుంచి బాబీ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లో స్టార్ట్ కానుంది. ఈ సినిమా కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే కీలక షెడ్యూల్ షూట్ ను జరుపుకోబోతుంది.

    ఇక ఎలాగూ ఆచార్య‌ షూటింగ్ ను చిరు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే, ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ కి సంబంధించిన వర్క్ జరుగుతుంది. రోజూ ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకూ చిరు ఆచార్యకి టైమింగ్స్ ఇస్తున్నాడు. మొత్తమ్మీద ఒకే సమయంలో నాలుగు సినిమాల‌కూ చిరు ఇలా డేట్లు కేటాయించడం ఇదే తొలిసారి.

    ఏడాది ఎనిమిది సినిమాలు చేసే రోజుల్లో కూడా చిరు ఇలా ఓకే సమయంలో నాలుగు సినిమాలకు డేట్లు ఇచ్చి.. ఓకే రోజు నాలుగు సినిమాల షూటింగ్ లో పాల్గొనడం ఇదే మొదటిసారి. మొత్తానికి ఈ నెల‌లో చిరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అసలు మెగాస్టార్ తన కెరీర్‌ లోనే ఎప్పుడూ ఈ స్థాయిలో కష్టపడి పనిచేయలేదు.

    Also Read: Bheemla Nayak: పవన్ భీమ్లానాయక్ లో త్రివిక్రమ్ మార్క్.. ఆయన చేసిన మార్పులివే..

    మరి చిరు ఎందుకు కష్టపడుతున్నారో ? పైగా ఈ వయసులో. నిజానికి చిరుకి ఇంత హ‌ర్రీ బ‌ర్రీగా సినిమాలు చేయాల‌ని ఉండ‌దు. సినిమా త‌ర‌వాత సినిమా అనేది త‌న పాల‌సీ. కానీ మెగాస్టార్ భిన్నంగా తన సినిమాల వేగాన్ని పెంచుకుంటూ పోయాడు.

    Also Read: Pushpa Movie: “పుష్ప” మూవీ యూనిట్ కి గోల్డ్ రింగ్ లు కానుకగా ఇచ్చిన బన్నీ…

    Tags