KTR
KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు సర్క్యులేట్ కావడం సాధారణంగా మారింది. గతంలో హుజూరాబాద్, దుబ్బాక, నాగార్జునసాగర్, మునుగోడు ఎన్నికల సమయంలో అనేక ఫేక్ పోస్టులు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ఏముందంటే..
ఈ వీడియో వాస్తవంగా కేటీఆర్ మాట్లాడింది. కానీ దానిని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో ఏం మాట్లాడారంటే..’కేసీఆర్‌ను ఓడించడమే నా జీవిత లక్ష్యం. నేను తప్పుకుంటున్నా.. కాంగ్రెస్‌కే గుద్దండి’ అని ఉంది. కానీ, ఇది ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో మాట్లాడిన మాటలు. ఇందులో వైఎస్ షర్మిల గురించి కేటీఆర్ మాట్లాడులూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘షర్మిల నేను పోటీ నుంచి తప్పకుంటున్నా.. కేసీఆర్‌ను ఓడించడమే నా లక్ష్యం, అందరూ కాంగ్రెస్‌కే గుద్దండి’ అని షర్మిల ప్రకటన చేసినట్లు ఉంది. కానీ దీనిని ఎడిట్ చేసి సర్క్యులేట్ చేయడంతో కొంతమంది వాస్తవమే అనుకునే అవకాశం ఉంది.
వివరణ ఇచ్చిన బీఆర్‌ఎస్..
తెలంగాణ కాంగ్రెస్ షేర్ చేసిన కేటీఆర్ వీడియోపై బీఆర్‌ఎస్ పార్టీ స్పందించింది. ’కేసీఆర్‌ను ఓడించడమే నా జీవిత లక్ష్యం. నేను తప్పుకుంటున్నా.. కాంగ్రెస్‌కే గుద్దండి’ అని కేటీఆర్ మాట్లాడినట్లుగా ఉన్న వీడియోను కాంగ్రెస్ షేర్ చేసింది. అయితే ఇది ఫేక్ వీడియో అని బీఆర్‌ఎస్ కొట్టిపారేసింది. ఓటమి ఖాయమని చిల్లర గాళ్లు పోలింగ్ రోజు ఫేక్ ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేసింది. అంతేకాదు.. కేటీఆర్ పూర్తి ప్రసంగాన్ని కూడా ఫేక్ వీడియోకు జోడించి పోస్టు చేసింది.
Fake NEWS ALERT
SPREAD IT
జై తెలంగాణ జై కేసీఆర్ pic.twitter.com/B0ROWndJUN
— AshaPriya (O+ Blood Group) (@ashapriya09) November 30, 2023
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: This is the real truth about ktrs video
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com