https://oktelugu.com/

జగన్ ఇంట ‘షర్మిల’ కొత్త పార్టీ చిచ్చు.. అసలు నిజం ఏంటి?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి మరణం తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పచ్చ పత్రికలు కలిసి వైఎస్సార్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ఎన్నో పన్నాగాలకు కుట్ర చేశాయని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన తరువాత.. షర్మిల దగ్గరుండి.. పార్టీని.. కుటుంబాన్ని అన్ని విధాలుగా పర్యవేక్షించుకున్నారు. పాదయాత్ర చేపట్టి.. అన్న చెల్లెల్ల అనుబంధాన్ని చాటి చెప్పారు.. ఇటీవల ఎన్నికల సమయంలోనూ.. జగన్నకు తోడుగా ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ..టీడీపీ అనుకూల […]

Written By:
  • NARESH
  • , Updated On : January 25, 2021 / 12:49 PM IST
    Follow us on

    దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి మరణం తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పచ్చ పత్రికలు కలిసి వైఎస్సార్ కుటుంబంలో చిచ్చు పెట్టాలని ఎన్నో పన్నాగాలకు కుట్ర చేశాయని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన తరువాత.. షర్మిల దగ్గరుండి.. పార్టీని.. కుటుంబాన్ని అన్ని విధాలుగా పర్యవేక్షించుకున్నారు. పాదయాత్ర చేపట్టి.. అన్న చెల్లెల్ల అనుబంధాన్ని చాటి చెప్పారు.. ఇటీవల ఎన్నికల సమయంలోనూ.. జగన్నకు తోడుగా ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ..టీడీపీ అనుకూల పత్రికల వైఖరిని, వారి కుట్రబారుతనాన్ని ప్రజలకు తెలిసేలా.. జోరుగా ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా.. జగన్ కు వెన్నంటే ఉన్నారు షర్మిలమ్మ. ఇప్పటికీ.. ఎప్పటికీ.. తాను జగనన్న సంధించే బాణాన్నే అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

    వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ మెహన్ రెడ్డి పరిపాలనపై.. తన వైఖరిపై ఏదో ఒక రకంగా బురద జల్లుతున్న తెలుగుదేశం అండ్ టీడీపీ అనుకూల మీడియా టీం ఇప్పడు సరికొత్త తప్పడు ప్రచారంతో రాష్ట్ర ప్రజలను నమ్మించాలనే మోసం చేస్తోంది. వ్యాక్సినేషన్ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు వద్దని ప్రభుత్వం అంటుంటే.. చంద్రబాబుకు అనుకూలంగా నిమ్మగడ్డ రమేశ్ బాబు ఎన్నికలు ఎలాగైనా నిర్వహిస్తామనడం.. దానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు.. ఐఏఎస్ అధికారులు.. పోలీసుశాఖ వారు కూడా ముక్తకంఠంతో ఎన్నికలు ఇప్పడే వద్దని అనడంతో ఖంగు తిన్న తెలుగుదేశం పార్టీ.. అండ్ పచ్చమీడియా మరో కుట్రకు తెరలేపాయి.

    ఈ క్రమంలో చంద్రబాబుకు సన్నిహితుడైన ఓ టీడీపీ అనుకూల పత్రిక ఎండీ.. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు భారీ కుట్రకు తెరలేపాడు.తన పత్రికలో రాసిన వ్యాసం ఇప్పడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందని.. త్వరలోనే వైఎస్ షర్మిలా తెలంగాణ వేదికగా కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని.. అందులో రాశారు. వైఎస్ జగన్ మెహన్ రెడ్డికి.. షర్మిలమ్మకు ఇమడడం లేదని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎంపీ పదవి ఇస్తానని అన్న మోసం చేశాడని.. ఆర్కే వద్దకు స్వయానా షర్మిలమ్మనే వచ్చి గోడు వెల్లబోసుకున్నట్లు ఊహించుకుని.. కథనాలు అల్లాడు. ఇందుకు వైఎస్. విజయమ్మ సైతం కూతురు వైపే నిలుస్తోందని.. తెలంగాణలో పార్టీ పెట్టేందుకు షర్మిలమ్మకు తల్లి సపోర్టు ఉందని.. వివరించాడు. ఈ క్రమంలో త్వరలోనే అంటే వచ్చే మూడు మాసాల్లో పార్టీ పేరు ఖరారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని.. రాశాడు.

    చంద్రబాబు షాడోగా పని చేస్తున్న టీడీపీ అనుకూల పత్రికలు మొదటి నుంచి జగన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. చిన్న విషయానిన భూతద్దంలో చూపెడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. గుండు పిన్ను గాయాన్ని గొడ్డలి పెట్టు అన్నట్టు చూపించే ఆర్కే పిచ్చి రాతల గురించి రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఇలాంటి కుట్రలు ఎన్ని పన్నినా.. వైఎస్. కుటుంబంలో ఇంచుకూడా వైరం జరగదని పాపం అతడికి తెలియదేమోనని వైసీపీ అభిమానులు అంటున్నారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఏపీ నిలుస్తున్న క్రమంలో పచ్చకామెర్లు వచ్చిన వాడిలా.. పిచ్చిరాతలతో ప్రజలను మోసం చేస్తున్నారు. బూటకపు వార్తలు రాస్తూ.. బజారులో పరువు తీసుకుంటున్నారు.

    వైఎస్సార్ మరణం నుంచి షర్మిలమ్మ.. వైఎస్ జగనన్నకు ఎళ్లవేళలా తోడుగా ఉంటుతోంది. అంతకు ముందు కూడా అన్నకు ఎంతో ఆదర్శ సోదరిగా ఉన్నారు. తాను ఎన్నటికీ జగనన్న బాణాన్నేనిని చెప్పుకొస్తోంది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ.. అన్నకు తోడుంటానని చాలా సమావేశాల్లో వెల్లడించింది. వైఎస్సార్ సీపీ అంటే తన తండ్రితో సమానం అని.. వైసీపీలో కొనసాగడం నాన్న గుండెల్లో గూడు కట్టుకున్నట్లు అనిపిస్తుంది చాలా సందర్భాల్లో వివరించారు. తమ కుటుంబంపై ఉన్న అభిమానాన్ని ఓర్వలేక.. జగనన్న పాలనను చూసి సహించలేని కొందరు కావాలని ఎన్ని కుట్రలు పన్నినా.. పట్టించుకోమని షర్మిలమ్మ చెబుతున్నారు.