https://oktelugu.com/

నాసిక్ టు ముంబయి.. సాగు చట్టాలపై కదం తొక్కిన మహారాష్ర్ట రైతులు

కేంద్రంచ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఒక్కటవుతున్నారు. ట్రాక్టరు ర్యాలీకి మద్దతుగా నిలుస్తున్నారు. ర్యాలీలో వేలాది మంది రైతులు పాల్గొనేలా రెడీ అవుతున్నారు. ట్రాక్టర్ల ర్యాలీ కోసం మహిళలు సైతం డ్రైవింగ్ నేర్చుకున్నారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు విధానలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు మహరాష్ర్ట రైతులు మద్దతు తెలుపుతున్నారు. ఈ మేరకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 25, 2021 / 01:00 PM IST
    Follow us on


    కేంద్రంచ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఒక్కటవుతున్నారు. ట్రాక్టరు ర్యాలీకి మద్దతుగా నిలుస్తున్నారు. ర్యాలీలో వేలాది మంది రైతులు పాల్గొనేలా రెడీ అవుతున్నారు. ట్రాక్టర్ల ర్యాలీ కోసం మహిళలు సైతం డ్రైవింగ్ నేర్చుకున్నారు.

    కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు విధానలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు మహరాష్ర్ట రైతులు మద్దతు తెలుపుతున్నారు. ఈ మేరకు భారీ కవాతు నిర్వహించారు. నాసిక్ నుంచి శనివారం బయల్దేరిన రైతులు రాజధానికి ముంబయికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. ఆల్ ఇండియా కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో వేలాది మంది రైతులు కవాతులో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మొత్తం 15వేల మంది రైతులు కవాతు నిర్వహించినట్లు మహాసభ తెలిపింది. ముంబయిలోని ఆజాద్ మైదానంలో నేడు భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

    Also Read: మోడీ సార్ ‘పెట్రో’ మంట.. ఆల్ టైం అత్యధికానికి చేరిక

    కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరత్ పవర్, శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే, తదితరులు హాజరు అవుతున్నారు. రైతులు, ఎర్రజెండాలు, బ్యానర్లు పట్టుకుని రహదారుల గుండా నడిచి వస్తున్న చిత్రాలు వైరల్ అవుతున్నాయి. మంగళవారం ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీకి పంజాబ్, హరియాణా రైతులు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ భారీ ర్యాలీ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు మహరాష్ర్టలోని 21 జిల్లాలకు చెందిన రైతులు నాసిక్ లో సమావేశం అయ్యారు.

    Also Read: దేశానికి 4 రాజధానులు.. బాంబు పేల్చిన బెంగాల్ సీఎం

    వ్యవసాయ చట్టాలను 18 నెలల పాటు నిలుపుదల చేస్తామని కేంద్రం ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి రైతుసంఘాల నాయకులు తిరస్కరంచారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన అనంతరం సంయుక్త కిసాన్ మోర్చా ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    జనవరి 26 రి పబ్లిక్ డే రోజున నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి సోమవారం పోలీసులు సైతం అనుమతి ఇచ్చారు. ఢిల్లీ పరిసరాల్లో 100 కిలో మీటర్ల పరిధిలో ర్యాలీ నిర్వహించడానికి అనుమతి వచ్చిందని రైతులు వెల్లడించారు. ఘాజీపూర్, సింఘం, టిక్రి సరిహద్దుల నుంచి ర్యాలీ ప్రారంభం అవుతుందని తెలిపారు.