ఎన్నాళ్ల గానో ఎదురుచూపు.. మరెన్నో కష్టాలు.. ఇంకెన్నో బాధలు.. వీటన్నింటినీ ఎదుర్కొని జగన్ గత 16 నెలల క్రితం సీఎం సీట్లో కూర్చున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పథకాలకు రూపకల్పన చేశారు. అన్నివర్గాల ప్రజలకు ప్రతీ పథకం అందాలని వాలంటీర్లను నియమించారు. ఇప్పటికే నవర్నతాల పేరిట ప్రజలందరికీ చేరువవుతుండగా.. ఇప్పుడు కొత్తగా విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు.
Also Read: జగన్ వలసలను ప్రోత్సహిస్తోంది అందుకేనా..?
మరో ప్రతిష్టాత్మక పథకాలకి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముందు నుంచీ విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్.. ఇంగ్లిష్ మీడియం విద్యనూ ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు అందించాలని తలిచారు. ఇక ఇప్పుడు జగనన్న విద్యాకానుకను ప్రారంభిస్తున్నారు. ఈ పథకం ద్వారా 42 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ కిట్లు పంపిణీ చేయనుంది. జూన్‌లో స్కూళ్ల ప్రారంభంకాగానే ఏపీలో ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే.. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. నవంబర్ 2 నుంచి మళ్లీ తెరుచుకోనున్నాయి.
Also Read: హిందుత్వ లొల్లి: ఢిల్లీ నుంచి రాగానే జగన్ సీరియస్ నిర్ణయం
ముఖ్యంగా ఈ కిట్‌లో 3 జతల యూనిఫాం, నోట్ బుక్స్, ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బుక్స్, మూడు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్‌ను ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల మందికి సుమారు రూ.650 కోట్లతో జగన్ ప్రభుత్వం ఈ కిట్లు అందిస్తోంది. మగపిల్లలకు స్కై బ్లూ రంగు, అమ్మాయిలకు నెవీ బ్లూ రంగు బ్యాగులు ఇస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి మూడు మాస్కులు కూడా అందించనున్నారు. అంతేకాదు.. స్కూళ్ల ప్రారంభానికి ముందే కిట్లు ఇస్తే విద్యార్థులను యూనిఫాంలు కుట్టించుకునే వెసులు బాటు ఉంటుందని జగన్ భావిస్తున్నారంట. అంటే.. ఈ లోపే కిట్లను విద్యార్థులకు అందజేయనున్నారన్నమాట.