https://oktelugu.com/

ప్రేమ పక్షులుగా మారుతున్న ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు

ఆడ..మగ మంచి పొంగు(వయస్సు) మీద ఉండి.. కొన్నిరోజులపాటు ఒకే హౌస్ లో ఉండాల్సి వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అనుకుంటా?. అలా అని అదేదో ఊహించుకోకండి.. కేవలం వాళ్ల మధ్య ప్రేమ(సంథింగ్ సంథింగ్).. అప్యాయత.. అనురాగం.. ఇంకా ఏవైనా ఉంటే అవన్నీ పుడుతాయని చెప్పొచ్చు.బుల్లితెర రియల్టీ షోలలో నెంబర్ వన్ కొనసాగుతున్న ‘బిగ్ బాస్’లో ఇలాంటి సీన్స్ బోలెడన్నీ దర్శనమిస్తున్నాయి. గత నాలుగు వారాలుగా బిగ్ బాస్-4 బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుత బిగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2020 / 09:53 AM IST
    Follow us on

    bigboss 4 participants

    ఆడ..మగ మంచి పొంగు(వయస్సు) మీద ఉండి.. కొన్నిరోజులపాటు ఒకే హౌస్ లో ఉండాల్సి వస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అనుకుంటా?. అలా అని అదేదో ఊహించుకోకండి.. కేవలం వాళ్ల మధ్య ప్రేమ(సంథింగ్ సంథింగ్).. అప్యాయత.. అనురాగం.. ఇంకా ఏవైనా ఉంటే అవన్నీ పుడుతాయని చెప్పొచ్చు.బుల్లితెర రియల్టీ షోలలో నెంబర్ వన్ కొనసాగుతున్న ‘బిగ్ బాస్’లో ఇలాంటి సీన్స్ బోలెడన్నీ దర్శనమిస్తున్నాయి. గత నాలుగు వారాలుగా బిగ్ బాస్-4 బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుత బిగ్ బాస్-4లో కంటెస్టులు ఎవరికీ వారు ఫార్మమెన్స్ తో ఇరగదీస్తున్నాయి. అయితే వారంతా ప్రేక్షకుల దృష్టిలో పడేందుకు లవ్ ట్రాక్ నడుపున్నట్లుగా కన్పిస్తోంది.

    Also Read: ఎక్స్ క్లూజివ్ : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా పోస్ట్ ఫోన్ !

    బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే ఓ ప్రేమదేశం లవ్ స్టోరీ నడుస్తుండగా మరో కొత్త ప్రేమ పుట్టుకురావడం ఆసక్తిని రేపుతోంది. నిన్నటి వరకు కూడా అభిజిత్.. మోనల్.. అఖిల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించింది. వీరి మధ్య ముద్దులు.. హగ్గులతోపాటు మనస్పర్థలు కూడా వచ్చాయి. ఇక మోనల్ తన పరువు తీసేస్తున్నారు అంటూ ఏ స్థాయిలో అరిచిందో చెప్పాల్సిన పనిలేదు.

    అయితే నిన్నటి ఎపిసోడ్లో మాత్రం అఖిల్ ని మొనల్ హగ్ చేసుకొని ముద్దు పెట్టి ఆడియెన్స్ కి షాకిచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ‘నిన్ననే ఆగ్రహంతో ఊగిపోయావు.. అంతలోనే ఇలా చేస్తున్నావ్..’ అంటూ వీరిపై సోషల్ మీడియాలో అనేక రకాల మీమ్స్ వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే దెత్తడి హారిక సైతం తనలోని మరో యాంగిల్ చూపిస్తోంది.

    బిగ్ బాస్ హౌస్ ప్రభావమో లేక.. అమ్మడు గేమ్ ప్లానేమో తెలియదుగానీ దెత్తడి హారిక.. అభిజిత్ ను తనవైపు ఎట్రాక్ట్ చేస్తోంది. నిన్నటి హోటల్ టాస్కులో అందరు ఒకవైపు అందరు గొడవ పడుతుంటే వీళ్ళిద్దరూ మాత్రం అపోజిట్ టీమ్ లో ఎందుకు వేసావ్ బిగ్ బాస్ అంటూ మాట్లాడుకున్నారు.

    Also Read: మరీ ఇంత అన్యాయమా.. పాపం ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ !

    ఇక ‘నాకు ఏ సర్వీస్ కావాలన్న నీతోనే చేపించుకోవచ్చు..’ అంటూ అభిజిత్ ను చూస్తూ దెత్తడి హరిక సిగ్గుపడటంతో వీరిమధ్య సంథింగ్.. సంథింగ్ నడుస్తుందనే గుసగుసలు విన్పిస్తున్నాయి. హారిక చివర్లో కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకుంది. కారణం ఏదైనా ఆమె మనసు అభిజిత్ వైపు మళ్ళీనట్లు అర్ధమవుతోంది. దీంతో బిగ్ బాస్ హౌస్ లో ప్రేమపక్షుల సందడి ఎక్కువైందనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.