https://oktelugu.com/

రేవంత్ రెడ్డికి మొదటి పరీక్ష ఇదే

మొత్తానికి ఎన్నో అడ్డంకులు దాటి మరీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి చేపట్టాడు. సొంత పార్టీలోని బలమైన పోటీదారులను పక్కకు తప్పించి మరీ ఈ అత్యున్నత పీఠాన్ని చేజిక్కించుకున్నాడు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ముడున్నరేళ్లలోనే ఈ పదవిని అందుకోవడం విశేషమనే చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందర తొలి టాస్క్ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి తొలి పరీక్ష ‘హుజూరాబాద్ ’ కానుంది. ఇక్కడ ఆయన నాయకత్వ […]

Written By: , Updated On : June 27, 2021 / 10:45 AM IST
Follow us on

మొత్తానికి ఎన్నో అడ్డంకులు దాటి మరీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి చేపట్టాడు. సొంత పార్టీలోని బలమైన పోటీదారులను పక్కకు తప్పించి మరీ ఈ అత్యున్నత పీఠాన్ని చేజిక్కించుకున్నాడు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ముడున్నరేళ్లలోనే ఈ పదవిని అందుకోవడం విశేషమనే చెప్పాలి.

ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందర తొలి టాస్క్ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి తొలి పరీక్ష ‘హుజూరాబాద్ ’ కానుంది. ఇక్కడ ఆయన నాయకత్వ పరీక్షకు ఇది లిట్మస్ టెస్ట్ లాంటింది. ఇతర పార్టీల ఎత్తులు, జిత్తులు సమర్థంగా అధిగమించాల్సి ఉంది. అంతకుమించిన రాజకీయ నైపుణ్యంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సి ఉంటుంది.

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కుదేలై ఆ స్థానాన్ని బీజేపీ మెల్లిమెల్లిగా ఆక్రమిస్తోంది. వైఎస్ చనిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను నడిపించే నాయకుడే లేకుండా పోయారు. ఉన్న నేతలంతా కోవర్టులుగా.. స్వప్రయోజనాలు, కాంట్రాక్టుల కోసం అధికార పార్టీతో లాలూచీ పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం, విశ్వాసం కోల్పోయిందంటున్నారు.

తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ కు భయపడకుండా ఢీ అంటే ఢీ అని పోరాడగట సామర్థ్యం రేవంత్ రెడ్డికి ఉంది. అందుకే రేవంత్ ను పీసీసీ చీఫ్ చేయగానే కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది. పాజిటివ్ సంకేతాలు శ్రేణులకు వెళ్లాయి. ఓ ఊపు వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ ఇన్నాళ్లకు ఓ మంచి నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక మొత్తం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగానే ఉంది. ఇక్కడ కాంగ్రెస్ గెలిచి కొన్న సంవత్సరాలు అవుతోంది. టీఆర్ఎస్ కంచుకోటగా హుజూరాబాద్ ఉంది. అంతకుముందు టీడీపీ గెలిచింది. ఈ క్రమంలోనే హుజూరాబాద్ లో రేవంత్ రెడ్డి శిష్యుడైన కశ్యప్ రెడ్డి అభ్యర్థిగా నిలబడుతున్నారు. మరి కనీసం గట్టి పోటీనిచ్చినా కూడా రేవంత్ స్టామినా తొలి అడుగులోనే తేలుతుంది. దీనికోసం రేవంత్ ఏం చేస్తాడు? ఎలా ముందుకెళుతాడన్నది వేచిచూడాలి.