Site icon OkTelugu

అనంతపురంలో ఆర్టీసీ బస్సు బీభత్సం

ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ధర్మవరం నుంచి అనంతపురం వస్తున్న బస్సు కార్లు, బైక్ లను ఢీకొట్టుకుంటూ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు బలంగా ఢీకొట్టడంతో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కార్లలో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయాలైన వారిని దగ్గరల్లో ఉన్న ఆస్పత్రికి స్థానికులు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేసున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version