
పాదయాత్ర చేసి ప్రజాసమస్యలు తెలుసుకొని మరీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ప్రచారంలో ప్రకటించినట్లుగా ప్రజల కోసం నవరత్నాలు అమలు చేశారు. అందులోని పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే దాదాపు ప్రతీ స్కీంను అమల్లోకి తీసుకొచ్చారు. అందుకే.. ఇప్పుడు సీఎం జగన్ పూర్తిస్థాయి ధీమాతో ఉన్నారట. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన మీద ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనే భరోసా వచ్చిందంట.
ఇదే విషయాన్ని జగన్‌కు అత్యంత సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లు సమాచారం. రాజధాని అమరావతి అంశం పెద్దగా పనిచేయదని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలకే పరిమితమవుతుందని చెప్పుకొచ్చాట. అందుకే జగన్ వర్గం కూడా అమరావతి అంశం సుమారు ఐదు నుంచి పది నియోజకవర్గాల్లోనే ప్రభావం చూపే అవకాశం ఉందని అప్పుడే లెక్కల్లోకి దిగింది.
Also Read : మోదీకి ట్వీటర్లో కేటీఆర్ కౌంటర్
ఎక్కడెక్కడైతే పార్టీకి మైనస్ ఉందో ఆ నియోకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సీఎం జగన్ ఉద్దేశమని సమాచారం. అందుకే అక్కడి ఎమ్మెల్యేలను కూడా ఆ దిశగా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి అంశంలో ఎక్కడా వెనక్కి తగ్గేలా లేరు జగన్. ఇక ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాజధాని అంశం తమకే పూర్తి అనుకూలంగా ఉందని పార్టీ క్యాడర్ కూడా అభిప్రాయపడుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మొన్నటి ఎన్నికల్లో కంటే ఆ రెండు ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు కూడా సాధించే అవకాశాలూ లేకపోలేదని భవిష్యత్ పరిణామాలను ఊహిస్తూ జగన్ తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరేళ్లు కొనసాగారు. ఆయన హయాంలో అమలు చేసిన ప్రతీ పథకం ప్రతీ గడపకూ చేరిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న పథకాలు కూడా అదే స్థాయిలో ప్రజలకు రీచ్ అవుతున్నాయి. ఏడాది సమయంలోనే మూడున్నర కోట్ల మందికి వివిధ పథకాలతో లబ్ధిచేకూరింది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలు కూడా ప్రజల్లోకి బాగా వెళ్లాయని నివేదికలు చెబుతున్నాయట. అందువల్ల భయమేదీ లేదని గోఅహెడ్ అని నేతలకు జగన్ సలహా ఇస్తున్నట్లు సమాచారం.
Also Read : అన్నదాతలకు తీపికబురు చెప్పిన మోడీ సర్కార్