
Chandrababu Vs YS Rajasekhar Reddy : తెలుగు రాస్ట్రాల్లో గొప్ప పాలన ఎవరిది.. గొప్ప ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే మెజారిటీ ప్రజలు టక్కున చెప్పే పేర్లు రెండే రెండు.. ఒకటి నందమూరి తారకరామారావు.. రెండు వైఎస్.రాజశేఖరరెడ్డి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాత్రం నారా చంద్రబాబునాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి సీఎంగా ఉన్నారు బాబు. కానీ, 60 ఏళ్ల తెలుగు రాష్ట్రాల చరిత్రలో ప్రజల మనసులు చెరగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రులు మాత్రం ఇద్దరే ఇద్దరు. బాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా.. ఆయన తర్వాత వచ్చిన వైఎస్సార్ ప్రజల ప్రియతమ నాయకుడిగా జనం గుండెల్లో గూడు కట్టుకున్నాడు. సంక్షేమ పాలనకు చిరునామాగా నిలిచారు. అదే బాబుకు, వైఎస్సార్‌కు ఉన్న తేడా..
కొన్ని అంశాలను పరిశీలిస్తే..
చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలో వ్యవసాయం దండుగ అయింది. ప్రైవేటు, కార్పొరేటు సంస్థలు ఆధిపత్యం చెలాయించాయి. సర్కారు వైద్యం చతికిల పడింది. ఉన్నత చదువులు పేద వాడకి దూరమయ్యాయి. ఉచిత కరెంటు అన్న ఊసే లేకుండా పోయింది.
స్వర్ణయుగంలా వైఎస్సార్ పాలన..
ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పాలన తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక స్వర్ణయుగంలా నిలిచిపోయింది. అందుకు ఏయనేదో మాయ మంత్రం చేయలేదు. రాజశేఖరరెడ్డి చేసిందల్లా పేదవాడి నాడి పట్టుకున్నాడు.

– బాబు దండగ అన్న వ్యవసాయాన్ని వైఎస్సార్ పండుగ చేశారు. జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు నిర్మించారు. వ్యవసాయానికి ఉచితంగా 9 గంటలు కరెంటు ఇచ్చారు.
– బాబు హయాంలో సర్కార్ వైద్యం పేదవాడకి దూరమైంది. చిన్న జ్వరం వచ్చినా పైసలు పట్టుకుని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రైవేటులో పేదవాడికి ఉచితంగా వైద్యం అందింది. ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల మందికి ప్రాణదానం చేశారు. రోగమొస్తే చావే అన్న భయంపోయి… ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నాయన్న ధీమా కలిగింది.
– ఇక చంద్రబాబు హయాంలో ఉన్నత విద్య అనేది ధనవంతుడికి మాత్రమే అన్నట్లు ఉండేది. వేలు, లక్షలు ఉంటేనే ఇంజినీరింగ్, డాక్టర్ చదువు అందుబాటులోకి వచ్చేది. వైఎస్సార్ సీఎం అయ్యాక ప్రతీ పేదింటి బిడ్డ కార్పొరేట్ కళాశాలలో ఉచితంగా చదివే అవకాశం వచ్చింది. ప్రభుత్వం ఫీజు చెల్లించడంతో ఉన్నత విద్య పేద విద్యార్థులకు చేరువైంది.
– సొంత ఇంటి కల చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కలగానే మిగిలిపోయింది. కానీ, వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక లక్షల మంది పేదల సొంతింటి కల నెరవేరింది. నేను కట్టిస్తా.. ఏడాదికి ఇన్ని ఇండ్లు కడతా అని చెప్పకుండా వైఎస్సార్, ప్రతీ పేద వాడికి ఇంత సొమ్మ ఇస్తా.. ఇల్లు కట్టి చూపించాలని మాత్రమే చెప్పాడు. అంతే.. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థికసాయంతో లబ్ధిదారులంతా సొంత ఇల్లు కట్టుకున్నారు. భూమి లేనివారికి భూమి కూడా ఇచ్చాడు వైఎస్సార్..
ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు వైఎస్సార్ హయాంలో ప్రారంభించినవే. ఇప్పటికీ ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీంలను ఎత్తివేసే సాహసం చేయడం లేదు. అందీ చంద్రబాబు, వైఎస్సార్‌కు ఉన్న తేడా.