
Das Ka Dhamki Collections : యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించిన ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది.భారీ హైప్ తో విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ వచ్చింది.కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి..మొదటి నుండి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండడం, దానికి తోడు ట్రైలర్ మరియు సాంగ్స్ బాగా ఆకట్టుకోవడం తో మూవీ పై యూత్ ఆడియన్స్ అమితంగా ఆసక్తి చూపించారు.
అందుకే ఓపెనింగ్స్ అమెరికా నుండి అనకాపల్లి వరకు రీసౌండ్ వచ్చేలా వచ్చాయి.ఈ చిత్రం కి ఇంత ఓపెనింగ్ రావడానికి కారణం బహుశా ప్రమోషనల్ కంటెంట్ అయ్యుండొచ్చు కానీ, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా గురించి మాట్లాడిన మాటలు కూడా ఈ మూవీ పై జనాల్లో ఆసక్తి కలగడానికి ఉపయోగపడ్డాయి.
ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే,ప్రస్తుతం ఈ సినిమాకి ఉన్న ట్రెండ్ ని బట్టీ చూస్తే మొదటి రోజు కచ్చితంగా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట.విశ్వక్ సేన్ గత రెండు చిత్రాలు ‘ఆకాశం లో అర్జున కళ్యాణం’ మరియు ‘ఓరి దేవుడా’ క్లోసింగ్ కలెక్షన్స్ ఇవి.వాటికి క్లోసింగ్ లో వచ్చిన వసూళ్లు ఈ సినిమాకి కేవలం మొదటి రోజే రాబోతుండడం విశేషం.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి దాదాపుగా 7 కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది.ఊపు చూస్తూ ఉంటే కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ స్టేటస్ ని అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.హీరో గా నిర్మాతగా మరియు దర్శకుడిగా ఈ చిత్రం విశ్వక్ సేన్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది అంటున్నారు విశ్లేషకులు.