గ్రేటర్ ఫైట్ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. రేపటితో ప్రచారం ముగియనుంది. దీంతో ఈ రెండు రోజుల్లో ప్రచారం మరింత ఊపులో సాగనుంది. ఇప్పటికే ప్రచార రంగంలోకి అగ్రనేతలు సైతం దూకిపోయారు. నేడు ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తుండగా.. ఇందుకోసం టీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మేనిఫెస్టో విడుదల రోజు కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు భారీగా మార్పు వచ్చింది. ఈ తరుణంలో కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
Also Read: గ్రేటర్లో హామీల అమలు సాధ్యమయ్యే పనేనా..?
మరోవైపు.. ఈ రోజే దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం హైదరాబాద్ వస్తున్నారు. అయితే.. ఓ స్థానిక సంస్థ ప్రచానికి ప్రధాని స్థాయి నేత రావడం అరుదు. దానికి తగ్గట్లుగానే మోడీ పర్యటన గ్రేటర్ ప్రచారం కోసం కాకున్నా ఆయన పర్యటన ఖచ్చితంగా గ్రేటర్ ఓటర్లపై ప్రభావం చూపుతుంది. మధ్యాహ్నం ప్రధాని మోడీ భారత్ బయోటెక్ ను సందర్శిస్తారు. వ్యాక్సిన్ పురోగతిని పరిశీలిస్తారు. మీడియాతో మాట్లాడుతారో లేదో స్పష్టత లేదు. కానీ.. ఆయన పర్యటన గంట మాత్రమే ఉండనుంది.
ఇకపోతే.. ఈ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని తహతహలాడుతూనే ఉంది. అందుకే.. అగ్రనేతలను రంగంలోకి దింపింది. రోజుకో అగ్రనేత ప్రచారానికి వస్తున్నారు. ప్రచారానికి ఆఖరి రోజు వరకూ ఎవరో ఒకరు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నేడు అమిత్ షా కూడా రాబోతున్నారు. మరోవైపు కేసీఆర్ ప్రచారసభతో టీఆర్ఎస్.. ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లినట్లుగా అవుతుంది. అగ్రనేతల ప్రచారంతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో జాతీయ స్థాయి నేతలెవరూ పాల్గొనడం లేదు. కేసీఆర్ పొలిటికల్ సభ.. మోడీ అపొలిటికల్ టూర్ గ్రేటర్ ప్రచారాన్ని పీక్స్‌లోకి తీసుకెళ్తున్నాయి.
Also Read: తెలంగాణవాదాన్ని కేసీఆర్ అందుకే పక్కన పెట్టారా..?
మొత్తంగా చూస్తే.. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు అటు అధికార పార్టీ.. ఇటు బీజేపీ పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ చివరి రెండు రోజుల్లో ప్రచారంతో ప్రజలను ప్రసన్నం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్నాయి. మరోవైపు..ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఓటరు నాడి కూడా ఎటూ అర్థం కాకుండా ఉంది. చివరకు అధికార పార్టీ నేతలే ఆ మాట చెప్పుకొస్తున్నారంటే ఎన్నికల్లో ఎంత టఫ్ ఫైట్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్