గ్రేటర్లో హామీల అమలు సాధ్యమయ్యే పనేనా..?

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. హామీలు కూడా విచ్చలవిడిగా ఇస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ లో మెనిఫెస్టోలను విడుదల చేసి నగరవాసులను ఆకట్టుకుంటున్నారు. ఆల్ ఫ్రీ అంటూ పార్టీలు చేస్తున్న హడావుడితో ఎవరికీ ఓటు వేయాలో అర్థం కాక నగర ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అయితే ఆయా పార్టీలు ఇచ్చే హామీలు అమలు అవుతాయా..? లేదా ఓట్ల కోసం ఇలా ప్రకటిస్తున్నారా..? అనే అనుమానాలు […]

Written By: NARESH, Updated On : November 28, 2020 12:12 pm
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. హామీలు కూడా విచ్చలవిడిగా ఇస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ లో మెనిఫెస్టోలను విడుదల చేసి నగరవాసులను ఆకట్టుకుంటున్నారు. ఆల్ ఫ్రీ అంటూ పార్టీలు చేస్తున్న హడావుడితో ఎవరికీ ఓటు వేయాలో అర్థం కాక నగర ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అయితే ఆయా పార్టీలు ఇచ్చే హామీలు అమలు అవుతాయా..? లేదా ఓట్ల కోసం ఇలా ప్రకటిస్తున్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Also Read: తెలంగాణవాదాన్ని కేసీఆర్ అందుకే పక్కన పెట్టారా..?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  పరిధిలో సమస్యలు తక్కువేం కాదు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఇంటి పన్ను, ఆదాయపు పన్ను, ఇంటి నిర్మాణాలకు సంబంధించిన అనుమతి తదితర విషయంలో కొందరు ఇబ్బంద పడుతుంటారు. అన్నింటికంటే ప్రధానంగా వేసవిలో హైదరాబాద్ లో తాగునీటి కొరత మామూలుగా ఉండదు. బిందె నీళ్ల కోసం ఎన్నో ప్రయాసలు పడుతుంటారు. ఇక డ్రైనేజీ వ్యవస్థ మొన్నటి వరదల కారణంగా బయటపడింది. ఎక్కడ సక్రమంగా లేకపోవడంతో మురుగు నీరు రోడ్డుపై ప్రవహించే పరిస్థితి ఏర్పడింది.

రాజకీయ పార్టీలు మాత్రం గ్రేటర్ పరిధి కాకుండా రాష్ట్ర ప్రయోజనం కోసమా..? అన్నట్లు హామీలు ఇచ్చేస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎష్ 20 లీటర్ల వరకు తాగునీరు ఫ్రీ అని చెప్పింది. ఆదాయపు పన్నును 50 శాతం తగ్గించింది. అయితే తాము గెలిస్తే కరోనా వ్యాక్సిన్ ఫ్రీ అని చెప్పడం హస్యాస్పదంగా ఉందంటున్నారు కొందరు. కరోనా వ్యాక్సిన్ ను కేవలం గ్రేటర్ వాసులకే ఇస్తారా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక సెలూన్లకు ఉచిత విద్యుత్ అని ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెలూన్ల షాపులవారు తమకు వర్తింప జేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: తప్పటడుగులు వేస్తున్న బండి సంజయ్

కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు సైతం ఇదే ధోరణిని వ్యవహరిస్తున్నాయి. వరదల కారణంగా నష్టపోయిన వారికి రూ. 50 వేలు ఇస్తానని, బీజేపీ రూ.25వేలు ఇస్తామని హామీలిచ్చాయి. దీంతో వరదల కారణంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పంటలు నష్టపోయాయి. దీంతో రైతులు తమకేమీ చేస్తారని అంటున్నారు. ఒకరి మెనెఫెస్టోను మరొకరు కాపీ కొట్టారని అని విమర్శలు వస్తున్నా మొత్తానికి అవి సాధ్యమయ్యే హామీలేనా..? అని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్