https://oktelugu.com/

ప్రకాశ్ రాజ్ కు మొదలైన సెగ..పనికిమాలినవాడు.. నాగబాబు కౌంటర్..! 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన నుంచి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ప్రజా సమస్యలపై స్పందిస్తూ పోరాటాలను చేస్తున్నారు. ఈక్రమంలోనే బీజేపీతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు. తెలంగాణలో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ బీజేపీ మద్దతు ప్రకటించాడు. దీంతో కొందరు పవన్ కల్యాణ్ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. Also Read: ఇటు కేసీఆర్‌‌.. అటు మోడీ.. ఏం జరుగనుంది? […]

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2020 / 12:13 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన నుంచి పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ప్రజా సమస్యలపై స్పందిస్తూ పోరాటాలను చేస్తున్నారు. ఈక్రమంలోనే బీజేపీతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు. తెలంగాణలో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ బీజేపీ మద్దతు ప్రకటించాడు. దీంతో కొందరు పవన్ కల్యాణ్ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

    Also Read: ఇటు కేసీఆర్‌‌.. అటు మోడీ.. ఏం జరుగనుంది?

    పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు ప్రకటించడంపై నటుడు ప్రకాశ్ నిన్న చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కల్యాణ్ ఉసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని.. బీజేపీకి పవన్ మద్దతు ఇస్తే మరీ జనసేన ఎందుకంటూ సూటిగా ప్రశ్నించాడు. అంతేకాకుండా కేసీఆర్ చాలా బీజీగా ఉన్నారని ఈసారి ప్రజలే బీజేపీకి.. ఆపార్టీకి మద్దతు ఇస్తున్న వారికి ప్రజలు రిటర్న్ గిప్ట్ ఇవ్వాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై తాజాగా జనసేన నాయకుడు.. నటుడు నాగబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ‌కీయాల్లో అనేక‌సార్లు నిర్ణ‌యాలు మారుతూ ఉంటాయని.. ఆ నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల‌కు మంచిచేసేవే అయితే విమ‌ర్శించాల్సిన అవసరం లేదని నాగబాబు అన్నారు. జ‌న‌సేన పార్టీ బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వెనుక విస్త్రృతమైన ప్ర‌జా ప్ర‌యోజ‌నాలున్నాయని నాగబాబు పేర్కొంటూనే పనిలో పనిలో ప్రకాశ్ రాజ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

    Also Read: గ్రేటర్లో హామీల అమలు సాధ్యమయ్యే పనేనా..?

    ‘పవన్ కల్యాణ్ ను ప్ర‌తీ ప‌నికి మాలిన‌వాడూ.. విమ‌ర్శించేవాడే.. మిస్ట‌ర్ ప్ర‌కాష్ రాజ్‌.. నీ రాజ‌కీయ డొల్ల‌త‌నం ఏమిటో.. బీజేపీ లీడ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి డిబేట్ లోనే మాకు అర్థ‌మైంది. నిన్ను తొక్కి పెట్టి నారతీస్తుంటే.. మాట్లాడ‌లేక త‌డ‌బ‌డ‌డం ఇంకా గుర్తుంది’ అంటూ ప్ర‌కాష్ రాజ్ పై నాగబాబు విమర్శలు గుప్పించారు.

    డ‌బ్బుల కోసం నిర్మాత‌లను హింసించి.. ఇచ్చిన డేట్స్ కాన్సిల్ చేసి.. కాల్చుకుతింటావ్ అంటూ ప్రకాశ్ రాజ్ పై నాగబాబు తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డాడు. ముందు ఓ మంచి మ‌నిషిగా మారి ఆ తర్వాత విమ‌ర్శించు అంటూ హిత‌వు ప‌లికాడు. మెగా బ్రదర్ నేరుగా లైన్లోకి వచ్చి ప్రకాశ్ రాజ్ పై విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ గామారింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఇక జనసైనికులు సైతం ప్రకాశ్ రాజ్ కు సోషల్ మీడియాల్లో కౌంటర్లు ఇస్తున్నారు. ప్రకాశ్ రాజ్ మిన్నకుండే టైప్ కాకపోవడంతో వీరిద్దరి మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరేలా కన్పిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు కాస్తా టాలీవుడ్ ను షేక్ చేేసేలా కన్పిస్తున్నాయి.