https://oktelugu.com/

బోయ‌పాటి చెప్పిందే వేద‌మా? బీబీ-3లో ఏం జ‌రుగుతోంది?

న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ అప్ క‌మింగ్ మూవీ బీబీ-3. సింహా‌, లెజెండ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఫ్యాన్స్ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. మ‌రోసారి మ్యాజిక్ రిపీట్ కావాల‌ని ఆశిస్తున్నారు. మ‌రోవైపు బోయ‌పాటి కూడా క‌సిగా వ‌ర్క్ చేస్తున్నాడు ‘విన‌య విధేయ రామ’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత చేస్తున్న సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు. Also Read: బిగ్ బ్రేకింగ్: పవన్-క్రిష్ మూవీ టైటిల్ […]

Written By:
  • Rocky
  • , Updated On : March 12, 2021 / 10:53 AM IST
    Follow us on


    న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ అప్ క‌మింగ్ మూవీ బీబీ-3. సింహా‌, లెజెండ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఫ్యాన్స్ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. మ‌రోసారి మ్యాజిక్ రిపీట్ కావాల‌ని ఆశిస్తున్నారు. మ‌రోవైపు బోయ‌పాటి కూడా క‌సిగా వ‌ర్క్ చేస్తున్నాడు ‘విన‌య విధేయ రామ’ వంటి భారీ డిజాస్టర్ తర్వాత చేస్తున్న సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నాడు.

    Also Read: బిగ్ బ్రేకింగ్: పవన్-క్రిష్ మూవీ టైటిల్ ఇదే.. వీడియో గూస్ బాంబ్స్

    అయితే.. భారీగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు అన్ని అంశాలను పరిశీలించి, ఏది చేయాలో డిసైడ్ కాలేక కన్ఫ్యూజ్ అవుతుంటారు. బీబీ-3 విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా పట్టాలెక్కింది కాబట్టి.. ముందు ఒకలా, తర్వాత మరోలా అనుకొని, చివరకు ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేయడంపైనే దృష్టిపెట్టారు. అఘోర పాత్ర‌ను వ‌ద్ద‌నుకుని, త‌ర్వాత ఓకే చేయ‌డం నుంచి చాలా విష‌యాల్లో ఇలా జ‌రిగింద‌ట‌.

    అయితే.. ఫైన‌ల్ గా ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్టు వెళ్తున్నాడ‌ట బాల‌య్య‌. దాదాపుగా.. అన్ని సినిమాల్లోనూ డైరెక్ట‌ర్ ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్తుంటారు బాల‌కృష్ణ. అయితే.. బీబీ-3ని స్పెష‌ల్ గా తీసుకోవ‌డంతో చాలా విష‌యాలు చ‌ర్చ‌లోకి వ‌చ్చాయ‌ట. చివ‌ర‌కు ఫ్యాన్స్ ను ఫుల్లుగా ఎంట‌ర్ టైన్ చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. ఆ ప్రకారం బోయపాటి సూచనలు ఫాలో అయిపోతున్నాడట.

    Also Read: టాకీసుల్లో ‘తీన్’ మార్‌.. శివ‌రాత్రి సింగం ఎవ‌రు..?

    ఇక‌, ఇప్ప‌టికే విడుద‌లైన మినీ టీజ‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయ‌డంతో సంబ‌రాలు చేసుకున్నారు ఫ్యాన్స్‌. ఇక మిగిలింది టైటిల్ అనౌన్స్ చేయ‌డ‌మే. ప‌లు పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఫైన‌ల్ గా ‘గాడ్ ఫాద‌ర్‌’ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. శివరాత్రి రోజునే అనౌన్స్ అనుకున్నప్పటికీ.. సాధ్యం కాలేదు. మరి, ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్