
Jagan YS Viveka : వివేకా వ్యవహాచంలో రెంటికీ చెడ్డ రేవడిలా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అటు స్వంత కుటుంబాన్ని కాపడుకోలేక, ఇటు ప్రభుత్వంపై పడ్డ మచ్చను కడుక్కోలేక గిలగిల్లాడుతుంది. స్వంత బాబాయిని చంపించారనే అపవాదును మూట్టగట్టుకున్న జగన్ ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయారు. బయటపడే మార్గాలు కనబడటం లేదు. ఈ కేసులో అరెస్టులు తప్పవనే సూచనలు కనిపిస్తున్నాయి.
అవినాష్ రెడ్డి ఆటలో అరటి పండేనా?
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఎస్ వివేకా హత్య అప్పట్లో సంచలనంగా మారింది. పూర్తిగా ఆ పార్టీపై నెట్టేసే ప్రయత్నంలో జగన్ అండ్ కో సఫలమయ్యారు. సానుభూతిని సంపాదించుకున్నారు. ఆ తరువాత అసలు నిజానిజాలను నిగ్గు తేల్చాలని సీబీఐ ఎంకై్రీ వేయించారు. ఆ తరువాత ఏర్పాటైన ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో కేసు విచారణ వేగవంతమవుతుందని అందరూ భావించారు. కానీ, ఎటువంటి పురోగతి లేకపోగా, అనూహ్యంగా స్వయానా వివేకా కుటుంబ సభ్యలు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, విచారణను తెలంగాణాకు మార్చాలని కోర్టును పిటీషన్ దాఖలు చేశారు.
అనుమానం పెనుభూతమై..
వివేకా మర్డర్ జరిగిన రోజు మృతదేహాన్ని సంఘటన ప్రాంతం నుంచి తరలించడానికి అవినాష్ రెడ్డి ముఖ్య కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హత్య జరిగిన రోజు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ఇంట్లో అవినాష్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం సీబీఐ ఎంక్వైరీకి హాజరైన ఆయనపై ఈ విషయంపైనే ఎక్కువ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్రూవర్ గా మారిన గంగిరెడ్డితో ఆయనకు ఉన్న సంబంధాలపైనా విచారణ ఎదుర్కొన్నారు. బెంగుళూరులో జరిగిన డబ్బు సెటిల్ మెంట్ హత్యకు కారణమనే వాదన వినిపిస్తోంది.
డిఫెన్స్‌లో పడ్డ వైసీసీ
మొత్తానికి వివేకా హత్య కేసు వైసీపీ ప్రభుత్వ మెడచుట్టూ బిగిసుకుంటుంది. తన అనునాయులను కాపాడుకునే ప్రయత్నంలో జగన్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సునీల్ యాదవ్ అరెస్టు అయిన రోజు అవినాష్ రెడ్డి వెళ్లి హడావుడి చేయడం, జైలుకు వెళ్లి కలిసిరావడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ఈ క్రమంలో జగన్ తనకేమి తెలియదని బుకాయించడం కుదురదు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. అవినాష్ రెడ్డితో పాటు జగన్ జైలుకెళ్లడం అనివార్యమని తెలుస్తుంది.