సీఎం.. సీఎం నినాదాలపై జూ.ఎన్టీఆర్ స్పందన ఇదీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అభిమానుల నుంచి ఒత్తిడి తీవ్రం అవుతోంది. ఎన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా సినిమాల్లో సత్తా చాటుతున్నాడు. నందమూరి వంశానికి ఉన్న ఏకైక దిక్కుగా మారాడు. అయితే తాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని బతికించాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనన్న డిమాండ్ ఇప్పుడు టీడీపీ కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది. చంద్రబాబు పని అయిపోవడం.. లోకేష్ బాబులో నాయకత్వ లక్షణాలు లేకపోవడంతో ఎన్టీఆర్ రావాలంటూ ఇప్పుడు టీడీపీ కార్యకర్తల […]

Written By: NARESH, Updated On : March 22, 2021 11:09 am
Follow us on

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అభిమానుల నుంచి ఒత్తిడి తీవ్రం అవుతోంది. ఎన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా సినిమాల్లో సత్తా చాటుతున్నాడు. నందమూరి వంశానికి ఉన్న ఏకైక దిక్కుగా మారాడు. అయితే తాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని బతికించాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనన్న డిమాండ్ ఇప్పుడు టీడీపీ కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది.

చంద్రబాబు పని అయిపోవడం.. లోకేష్ బాబులో నాయకత్వ లక్షణాలు లేకపోవడంతో ఎన్టీఆర్ రావాలంటూ ఇప్పుడు టీడీపీ కార్యకర్తల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది.కుప్పంలోనూ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి.

ఇటీవల ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రమోషన్ కు వచ్చిన ఎన్టీఆర్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. ‘టీడీపీని ఎప్పుడు లీడ్ చేస్తారని’ విలేకరుల ప్రశ్నించగా.. ‘ఇది సమయం కాదు.. సందర్భం కాదు’ అంటూ జూ.ఎన్టీఆర్ దాటవేశారు.

తాజాగా ఎంఎం కీరవాణి వారసుడు.. రాజమౌళి అన్న కుమారుడు శ్రీసింహా హీరోగా వచ్చిన ‘తెల్లవారితే గురువారం’ ప్రీరిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ అతిథిగా వచ్చాడు. ఎన్టీఆర్ ప్రసంగిస్తుండగా.. ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు అభిమానుల నుంచి వినిపించాయి. దీంతో ఎన్టీఆర్ కాస్త ఇబ్బంది పడ్డాడు.. ‘దయచేసి ఆపండి బ్రదర్’ అంటూ అభిమానులకు సూచించాడు. ఇలా ‘టీడీపీని ఓన్ చేసుకోవలన్న డిమాండ్’ ఎన్టీఆర్ కాస్త గట్టిగానే తగులుతోంది. మరి ఈ జూనియర్ ఏం చేస్తాడన్నది వేచిచూడాలి.