https://oktelugu.com/

కాంగ్రెస్-టీడీపీ తెరచాటు బంధానికి ఇదే నిదర్శనం..!

గత ఎన్నికలలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం పార్టీ సిద్ధాంతానికి భిన్నంగా పొత్తులు పెట్టుకున్నారు. బేజేపీని ఎదిరించి జాతీయ స్థాయిలో మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీతో కలిశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సిద్ధాంతానికే వ్యతిరేకమైన ఈ నిర్ణయాన్ని టీడీపీ సీనియర్ నేతలే విమర్శించగా… బాబు వారి నోళ్లు బలవంతగా మూయించాడు. 2018 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్-టీడీపీ కూటమి ఘోర పరాజయం పాలయ్యింది. అక్కడ వచ్చిన ఫలితం దెబ్బకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 17, 2020 / 07:39 PM IST
    Follow us on


    గత ఎన్నికలలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం పార్టీ సిద్ధాంతానికి భిన్నంగా పొత్తులు పెట్టుకున్నారు. బేజేపీని ఎదిరించి జాతీయ స్థాయిలో మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీతో కలిశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సిద్ధాంతానికే వ్యతిరేకమైన ఈ నిర్ణయాన్ని టీడీపీ సీనియర్ నేతలే విమర్శించగా… బాబు వారి నోళ్లు బలవంతగా మూయించాడు. 2018 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్-టీడీపీ కూటమి ఘోర పరాజయం పాలయ్యింది. అక్కడ వచ్చిన ఫలితం దెబ్బకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమిలో కొనసాగిన బాబు, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ తో సంబంధం లేకుండా ఒంటరిగా పోటీ చేశాడు. ప్రతిసారి ఎదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్లే బాబు మొదటిసారి ఒంటరిగా పోటీ చేసి ఘోర ఓటమి చవిచూశాడు. ఈ ఎన్నిక ఫలితాల తరువాత బాబు నిజమైన బలం అర్ధమైంది అని అందరూ అనుకున్నారు.

    ఆంధ్రలో ఎన్ని జిల్లాలు వుండాలి?

    పార్లమెంట్ ఎన్నికలలో నమ్ముకున్న కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడంతో బాబు, కాంగ్రెస్ జాతీయ నేతలను పట్టించుకోవడం మానేశారు. వీరి మధ్య ఎటువంటి చర్చలు, సమావేశాలు జరగలేదు. ఎందుకంటే అప్పటి తాత్కాలిక అవసరాల కోసం బాబు పెట్టుకున్న పొత్తు తప్పా, ఇది ప్రజా ప్రయోజనాల కోసమో…సంక్షేమం కోసమో కాదు. ఐతే ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్ లో కొనసాగుతున్న ఆ పార్టీ నేతలు టీడీపీ నిర్ణయాలకు, ఉద్యమాలకు మద్దతు ప్రకటిస్తూ.. అంతర్గంతంగా బంధం కొనసాగిస్తున్నారేమో అనే అనుమానాలు బలపరుస్తున్నారు.

    జగన్ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాడట..!

    ఇటీవల టీడీపీ నేత సోమిరెడ్డి ఓ సంచలన డిమాండ్ తెరపైకి తెచ్చారు. జగన్ ప్రభుత్వం ప్రకటించిన వడ్డీలేని రుణాల మంజూరు పథకాన్ని ప్రవేశపెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాబట్టి, వైస్సార్ పేరుకు బదులు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓ టీడీపీ నేత కాంగ్రెస్ లో కనీసం క్రియాశీలకంగా కూడా లేని కిరణ్ కుమార్ రెడ్డి పేరు పెట్టండి అని అడగడం అందరినీ షాక్ కి గురిచేసింది. తాజాగా నేడు మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ చౌదరి వ్యవహారంలో సీనియర్ కాంగ్రెస్ నేత తులసి రెడ్డి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పలుమార్లు రమేష్ చౌదరి విషయంలో న్యాయస్థానం జగన్ ప్రభుత్వ తీరుని తప్పుబట్టాయని, జగన్ కి సిగ్గుంటే రాజీనామా చేయాలని కోరారు . ఇటీవల బీజేపీ, టీడీపీ నేతలతో రహస్య మీటింగ్స్ పాల్గొన్న రమేష్ చౌదరికి కాంగ్రెస్ నేత వత్తాసు పలకడం అనేక అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ-కాంగ్రెస్ మధ్య రహస్యం బంధం కొనసాగుతుందనే అనుమానాలను బలపరుస్తుంది. ఎన్నికల కోసం ఒక స్కీమ్, విమర్శల కోసం మరో స్కీమ్ టీడీపి, కాంగ్రెస్ వాడుతున్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు.