https://oktelugu.com/

బీ అలర్ట్: ఈ నెలలోనే థర్డ్ వేవ్

ప్రపంచంలో కొవిడ్ -19 ఉధృతి కొనసాగుతూనే ఉంది. మొదటి, రెండో దశలు విజృంభించి ప్రజల ప్రాణాలనే తీసుకున్నాయి. దీంతో ఎంతో మంది వైరస్ ధాటికి బలయ్యారు. దేశంలో కొన్ని స్టేట్లలో కరోనా వైరస్ విజృంభించి వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. మూడో దశ ఏ స్థాయిలో ఉంటుందోనని భయాందోళన చెందుతున్నారు. రెండు దశల్లో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు పణంగా పెట్టాల్సి రావడం దారుణం. మూడో దశలో కరోనా కేసుల సంఖ్య లక్ష లోపు ఉంటుందని చెబుతున్నారు. పరిస్థితులు […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 3, 2021 1:56 pm
    Follow us on

    Corona third waveప్రపంచంలో కొవిడ్ -19 ఉధృతి కొనసాగుతూనే ఉంది. మొదటి, రెండో దశలు విజృంభించి ప్రజల ప్రాణాలనే తీసుకున్నాయి. దీంతో ఎంతో మంది వైరస్ ధాటికి బలయ్యారు. దేశంలో కొన్ని స్టేట్లలో కరోనా వైరస్ విజృంభించి వేలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. మూడో దశ ఏ స్థాయిలో ఉంటుందోనని భయాందోళన చెందుతున్నారు. రెండు దశల్లో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ప్రాణాలు పణంగా పెట్టాల్సి రావడం దారుణం. మూడో దశలో కరోనా కేసుల సంఖ్య లక్ష లోపు ఉంటుందని చెబుతున్నారు. పరిస్థితులు విషమిస్తే 1.5 లక్షల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.

    కేరళ, మహారాష్ర్ట వంటి స్టేట్లలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో రెండో దశలో కేసుల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. వైరస్ కు హాట్ స్పాట్ గా మారుతున్న ప్రాంతాలను గుర్తించి కొత్త వేరియంట్ రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విజృంభణకు కేంద్ర బిందువైన భారత్ లోనే వెలుగు చూసిన అంశం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గు ముఖం పడుతుండడంతో ప్రజలు కార్యకలాపాలను విస్తరించుకుంటున్నారు. ఇదే సందర్భంలో ప్రజల్లో అలసత్వం పెరిగిపోతోందని తెలుస్తోంది.

    రెండో దశలో ప్రజల్లో ఆహార అలవాట్టలో మార్పులతో ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగింది. దీంతో మూడో దశలో కూడా ప్రజలపై పెద్దగా ప్రభావం చూపించదని భావిస్తున్నారు. రెండో దశ అయిపోయి ఐదు నెలలు గడిచిపోయాయి. ప్రస్తుతం రోజువారీ కరోనా కేసుల సంఖ్య సుమారు 40 వేల లోపు ఉంటున్నాయి. దీంతో కేసుల సంఖ్య దేశంలో మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాక్సినేషన్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. దేశ జనాభాలో 7.6 శాతం మందికి మాత్రమే టీకాలు వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

    దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాల్సి ఉంది. నగరాల్లో వైరస్ క్లస్టర్లను గుర్తించి గాలి, మురుగునీటి నమూనాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ప్రజారోగ్య వైద్య నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తూ అందరికి ఆరోగ్యం చేకూరేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఆస్పత్రుల్లో బాధితుల తాకిడి పెరగడానికి ముందే ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలని సూచిస్తున్నారు.