తమిళనాట ఇన్నాళ్లు ఎదురే లేకుండా విజయం సాధిస్తున్న అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ షాకిచ్చారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు రజినీకాంత్ ప్రకటించారు. ఈ ప్రకటన తమిళ పాలిటిక్స్ లో హీట్ పెంచింది.
Also Read: రాష్ట్రపతి భవన్‌కు కాలినడకన రాహుల్
కమల్ హాసన్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు. అవినీతి రహిత, పారదర్శక పాలన కోసం మూడో కూటమిని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించాడు. భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ కలిసి రావాలని కమల్ పిలుపునిచ్చాడు.
ఈ రెండు పార్టీల హయాంలో రాష్ట్రం అవినీతిమయం తయారైందని అన్నాడీఎంకే, డీఎంకేలపై కమల్ హాసన్ విరుచుకుపడ్డారు. విల్లుపురంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో యువత పోటీకి ప్రాధాన్యత కల్పిస్తామని.. తమ పార్టీలో యూత్ చేరాలని కమల్ కోరారు.
Also Read: ఏపీ డీజీపీ ఇంటిపై డ్రోన్ కెమెరాలు.. ఎగురవేసింది ఎవరు?
రానున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్ల కోసం అందరి ఇళ్లకు వెళ్లాలని అనుకుంటున్నట్టు కమల్ తెలిపాడు. తన మిత్రుడు రజినీకాంత్ ఇంటిని వదిలేస్తానా? అని కమల్ వ్యాఖ్యానించారు. రజినీ పార్టీతోనూ కమల్ పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. వచ్చే సంవత్సరం జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ మద్దతు కోరుతానని కమల్ హాసన్ ఇదివరకే ప్రకటన చేశారు. కమల్-రజినీ కలిసి చిన్న పార్టీలు కూడా దీంతో జత కడితే తమిళనాట ఖచ్చితంగా విజయం వీరిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్