https://oktelugu.com/

సిద్దార్థ్ ను పెళ్లి చేసుకుంటే నా బ్రతుకు మరో సావిత్రి అయ్యేది!

ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది సమంత. ఓ సందర్భంలో ‘సినిమా విజయంలో హీరో హీరోయిన్ పాత్ర సమానం అయినప్పుడు రెమ్యూనరేషన్ మాత్రం హెచ్చు తగ్గులు ఎందుకు’ అని ఓపెన్ గానే అడిగేసింది సమంత. ఫార్మ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ ఆ తరహా వ్యాఖ్యలు చేయడం పెద్ద సాహసమే. ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే ఎసరు రావచ్చు. అలాంటి సమంత తన లవ్ ఎఫైర్ గురించి ఓపెన్ గా మాట్లాడి సంచలనానికి తెరలేపింది. తెలుగు […]

Written By:
  • admin
  • , Updated On : December 24, 2020 / 01:12 PM IST
    Follow us on


    ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది సమంత. ఓ సందర్భంలో ‘సినిమా విజయంలో హీరో హీరోయిన్ పాత్ర సమానం అయినప్పుడు రెమ్యూనరేషన్ మాత్రం హెచ్చు తగ్గులు ఎందుకు’ అని ఓపెన్ గానే అడిగేసింది సమంత. ఫార్మ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ ఆ తరహా వ్యాఖ్యలు చేయడం పెద్ద సాహసమే. ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే ఎసరు రావచ్చు. అలాంటి సమంత తన లవ్ ఎఫైర్ గురించి ఓపెన్ గా మాట్లాడి సంచలనానికి తెరలేపింది. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో సామ్ జామ్ పేరుతో ఓ టాక్ షో జరుగుతుంది. సామ్ జామ్ టాక్ షోకి హోస్ట్ గా ఉన్న సమంత టాలీవుడ్ స్టార్స్ ని ఇంటర్వ్యూ చేస్తున్నారు.

    Also Read: ‘రెడ్ ట్రైలర్’ టాక్: డబుల్ రోల్ లో షేక్ చేసిన ‘రామ్’

    విజయ్ దేవరకొండ, తమన్నా, అల్లు అర్జున్, రానా వంటి స్టార్స్ ఈ షోకి గెస్ట్స్ గా వచ్చారు. తాజా ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి అతిథిగా పాల్గొన్నారు. మెగాస్టార్ ని కూడా తన చిలిపి ప్రశ్నలతో తికమమక పెట్టింది సమంత. కాగా ఈ షోలో ఓ సందర్భంలో సమంత తన ఎక్స్ లవర్ సిద్దార్థ్ గురించి ఓపెన్ అయ్యారు. కెరీర్ బిగినింగ్ లో సమంత, సిద్దార్థ్ డీప్ లవ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. కొంత కాలం తరువాత సమంత- సిద్దార్థ్ బ్రేకప్ కథనాలు కూడా రావడం జరిగింది. సమంత ఈ విషయంపై ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా సిద్దార్థ్ తో లవ్ ఎఫైర్ గురించి ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.

    Also Read: పాన్ ఇండియా దర్శకులకు ప్రభాసే కావాలట!

    ‘సిద్దార్థ్ ను గతంలో ప్రేమించిన విషయం నిజమే.. కొన్ని కారణాల వలన బ్రేకప్ కావాల్సి వచ్చింది. ఒకవేళ సిద్దార్థ్ ను పెళ్లి చేసుకుంటే నా బ్రతుకు మరో సావిత్రిలా అయ్యేది’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది సమంత. సావిత్రి విషయానికి వస్తే భర్త జెమినీ గణేష్ ఎఫైర్స్ గురించి తెలిసి, మందుకు బానిసై, ఆర్థిక ఇబ్బందుల్లో దుర్భరంగా చనిపోయారు. నాజీవితం కూడా అలా అయ్యేదని సమంత పరోక్షంగా చెప్పినట్లు అయ్యింది. సిద్దార్థ్ తో బ్రేకప్ తరువాత తనకు నాగ చైతన్య దగ్గరయ్యారని సమంత అన్నారు. నాగ చైతన్యతో తన లైఫ్ హ్యాపీగా ఉందన్న సమంత, ఆయన భర్తగా దొరకడం నా అదృష్టం అని తెలియజేశారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్