https://oktelugu.com/

నివర్‌‌ బాధిత రైతుల కోసం పవన్‌ ప్రత్యక్ష పోరాటం

అటు సినిమాలు చేస్తూనే.. ఇటు రాజకీయాల్లోనూ తమ ప్రాభవం చాటాలని చూస్తున్నాడు పవన్‌ కల్యాణ్‌. ఇందులో భాగంగా రైతు సమస్యలపై పోరాడుతున్నారు. ఇప్పటికే నివార్‌‌ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ఓసారి జిల్లాల్లో పర్యటించారు పవన్‌ కల్యాణ్‌. ఓసారి దీక్ష కూడా చేశారు. ఇప్పుడు మరింత ముందుకెళ్లి కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 28న అన్ని కలెక్టరేట్ల ఎదుట జనసేన నేతలు ధర్నాలు చేయబోతోంది. తదుపరి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 24, 2020 / 01:24 PM IST
    Follow us on


    అటు సినిమాలు చేస్తూనే.. ఇటు రాజకీయాల్లోనూ తమ ప్రాభవం చాటాలని చూస్తున్నాడు పవన్‌ కల్యాణ్‌. ఇందులో భాగంగా రైతు సమస్యలపై పోరాడుతున్నారు. ఇప్పటికే నివార్‌‌ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ఓసారి జిల్లాల్లో పర్యటించారు పవన్‌ కల్యాణ్‌. ఓసారి దీక్ష కూడా చేశారు. ఇప్పుడు మరింత ముందుకెళ్లి కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 28న అన్ని కలెక్టరేట్ల ఎదుట జనసేన నేతలు ధర్నాలు చేయబోతోంది. తదుపరి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు.

    Also Read: ఏపీ డీజీపీ ఇంటిపై డ్రోన్ కెమెరాలు.. ఎగురవేసింది ఎవరు?

    అయితే.. ఈ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ కూడా పాల్గొనబోతున్నారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ ఉన్న మచిలీపట్నంలో ఆయన ధర్నాలో పాల్గొంటారు. తరువాత కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తారు. పవన్ కల్యాణ్ ప్రత్యక్ష పోరాటాల్లోకి దిగడంతో..జనసేన క్యాడర్‌కు ఎక్కడ లేని ఉత్సాహం వస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ పెద్దగా ప్రజల్లోకి రాలేదు. ఇప్పుడు మళ్లీ తీరిక చేసుకుంటున్నారు.

    నివర్‌‌ తుపాన్ కారణంగా రైతులు భారీగా నష్టపోయారని ఆది నుంచి పవన్ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎకరాకు రూ.30 వేల వరకూ పరిహారం ఇస్తేనే రైతులు బయటపడుతారని ఆయన అంటున్నారు. తక్షణ సాయంగా పదివేలు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం పవన్ కల్యాణ్ డిమాండ్‌ను ఏమాత్రం పట్టించుకోలేదు. రైతులకు ఎలాంటి సాయమూ ప్రకటించలేదు. కేవలం ఇన్‌పుట్ సబ్సిడీ రూ.700 కోట్లు ఇస్తామని చెప్పింది. దీంతో రైతులకు నివర్ తుపాన్ సాయం అందే అవకాశం కనిపించడం లేదు.

    Also Read: కేంద్రం చేతిలో జగన్‌ కీలుబొమ్మ.. అందుకేనా..!

    మరోవైపు.. ఇన్నిరోజుల గ్యాప్‌ను ఎలాగైనా పూడ్చాలని పవన్‌ కల్యాణ్‌ కూడా బెట్టుతో ఉన్నారు. ఇందుకు ప్రజాపోరాటాలే పరిష్కారమని భావించారు. లాక్ డౌన్‌కు ముందు ఇసుక సమస్యపై విశాఖలో మార్చ్ నిర్వహించారు. తర్వాత సైలెంటయ్యారు. ఈ సారి అలాంటి మార్చ్‌ల కన్నా.. అన్ని చోట్లా జనసేన కార్యకర్తలను యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారు. తుపాను బాధిత జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు నిర్ణయించారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్