Waterfalls: మండు వేసవిలో చల్లదనం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పైన ఎండ దంచికొడుతున్న సమయంలో.. చల్లగా జలపాతంలో ఈత కొట్టాలని ఎవరికైనా ఉంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం.. హైదరాబాద్ కు దగ్గరలో ఏమేం జలపాతాలు ఉన్నాయో తెలుసుకోండి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సినవి ఇవే.
హైదరాబాద్‌కు 170 కిలోమీటర్ల దూరంలో అనగా.. శ్రీశైలానికి 58 కిలోమీటర్లలో మల్లెల తీర్థం జలపాతం ఉంది. ఇక్కడకు రోడ్డు మార్గం కూడా ఉంది. అయితే ఇందులో ఎంజాయ్ చేయాలంటే 250 మెట్లు దిగాల్సి ఉంటుంది.

సిటీకి 173 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎత్తిపోతల జలపాతం చాలా ఫేమస్. ఇది నాగార్జున సాగర్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చంద్రవంక అనే నది దాదాపు 70 అడుగుల మీద నుంచి ప్రవహిస్తుంది. ఇది చాలా బాగుంటుంది.

వరంగల్ జిల్లాలోని గూడూరు మండలంలో ఉన్న భీముని పాదం జలపాతం కూడా చాలా బాగుంటుంది. ఇది హైదరాబాద్‌కు 200 కిమీల దూరంలో ఉంటుంది.

సిటీకి 257 కిలోమీటర్ల దూరంలో ఉండే పొచ్చెర జలపాతం కూడా చాలా ఫేమస్. ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని దగ్గరకు రోడ్డు మార్గం కూడా ఉంది.
హైదరాబాద్ నుంచి 260 కిలోమీటర్ల దూరంలో ఉంది కుంటాల జలపాతం. ఇక్కడ కడెం నది సహ్యాద్రి కొండల మీద నుంచి దాదాపు 45 మీటర్ల ఎత్తులో దూకుతుంది. చూడటానికి అద్భుతంగా ఉంటుంది ఈ జలపాతం. ఇక్కడకు వేలాదిగా పర్యాటకులు వస్తుంటారు.

ఇక ఆదిలాబాద్‌కు 116 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో ఉంది సహస్రకుండ్ జలపాతం. పెన్‌గంగ నది మీద ఈ జలపాతం ఉంది. ఎక్కువ రోజులు స్పెండ్ చేయడానికి ఇది సరైన ప్లేస్.
ఇక మరో జలపాతం కనకై. దీన్నే బంద్రేవ్ జలపాతం అని కూడా అంటారు. ఇది హైదరాబాద్ నగరానికి 282 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడెం నది మీద ఈ జలపాతం ఉంది. ఆదిలాబాద్ కేంద్రానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది.
ఇక చివరగా బొగతా జలపాతం. దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ఉంటుంది. హైదరాబాద్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చత్తీస్‌గడ్ అడవుల నుంచి వచ్చే నది మీద ఈ జలపాతం ఉంది.
