Relationship: అమ్మాయిలను ఆకర్షించాలని ఏ అబ్బయి అయినా కోరుకుంటాడు. అయితే అమ్మాయిలను పడేయాలంటే అంత ఈజీ కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. అన్ని పనులు వదులుకుని అమ్మాయి వెంట పడితే.. చివరకు పడుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. అయితే అమ్మాయిలకు ఎలాంట అబ్బాయిలు అంటే ఇష్టం ఉంటుంది, ఎలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలను వారు ఇష్టపడుతారు అనే విషయాలు తెలుసుకుంటే.. అమ్మాయిలను పడేయడం చాలా ఈజీ కదా.

మరి వారికి అబ్బాయిల్లో ఇష్టమైన లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఉండాల్సింది చలాకీ తనం. అంటే ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వ్యక్తిని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతారు. సీరియస్ గా ఉండే వారిని అమ్మాయిలు అస్సలు పట్టించుకోరు.
రెండోది సమయస్ఫూర్తి.. చిన్న సమస్యల నుంచి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు సమయస్ఫూర్తిగా పరిష్కరించే అబ్బాయిలకు అమ్మాయిలు ఫిదా అవుతారంట. ఉదాహరణకు.. థియేటర్‌కు వెళ్లినప్పుడు సినిమా టికెట్లు దొరక్క పోతే ఏం చేస్తాడు అన్న దగ్గరి నుంచి పెద్ద సమస్యల వరకు అబ్బాయిలను పరిశీలిస్తారంట అబ్బాయిలు.
Also Read: Corona 4th Wave In India: ముంచుకొస్తున్న కరోనా ఫోర్త్ వేవ్.. కేంద్రం హైఅలెర్ట్
ఇక మూడోది ఆత్మవిశ్వాసం.. కాన్పిడెంట్ గా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. నడకలో, మాటల్లో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే అబ్బాయిలను అమ్మాయిలు బాగా లైక్ చేస్తారు.
నాలుగోది అందం మీద శ్రద్ధ పెట్టే అబ్బాయిలు అంటే అమ్మాయిలు ఇష్టపడుతారు. అదే పనిగా అద్దానికి అతుక్కుపోతే అస్సలు పట్టించుకోరట. ముఖ్యంగా డ్రెస్సింగ్ స్టైల్.. ఉన్న అబ్బాయిలకు అమ్మాయిలు ఈజీగానే పడిపోతారంట.

ఐదోది జీవితంలో ఏదైనా సాధించాలనే తపన.. ఇది ఉన్న అబ్బాయిలు అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. ఎత్తుకు ఎదగాలని నిత్యం కష్టపడే వారితోనే జీవితం పంచుకోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.
జనరల్ నాలెడ్జ్ ఉన్న అబ్బాయిలకు కూడా అమ్మాయిలు త్వరగానే పడిపోతారు. అంటే బుక్స్ లో ఉండే నాలెడ్జ్ కాదండోయ్.. ఇప్పటి సమాజంలో ఉపయోగపడే నాలెడ్జ్. ఏ వస్తువుల మీద ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి, ఏ సెంటర్ లో ఏ మూవీ ఆడుతోంది, పలానా ప్రాంతానికి వెళ్లాలంటే ఎలా వెళ్లాలి లాంటి నాలెడ్జ్ అన్న మాట.
ఇక ఎదుటి వారి అవసరానికి సాయం చేసే వారంటే చాలా ఇష్టపడుతారు. కానీ అదే పనిగా దానకర్ణుడిగా సాయం చేసినా కూడా పెద్దగా ఇష్టపడరంట.
ఇక ధైర్యంగా ఉన్న అబ్బాయిలు అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. దేనికీ భయపడని వారికి, ఎలాంటి సమస్యను అయినా ఎదురించే అబ్బాయిలకు చాలా ఇష్టం.
అయితే ఇక్కడ మీకు ఓ డౌట్ రావొచ్చు. ఇవేవీ లేని వారు కూడా అమ్మాయిలను పడేస్తున్నారు కదా అని.. కానీ అలాంటి రిలేషన్స్ ఎక్కువ కాలం నివవవు. మంచి అందమైన అమ్మాయిలతో జీవితం పంచుకోవాలంటే మాత్రం ఇలాంటి లక్షనాలు ఉండాలి.
Also Read: Kapu Reservation: ఏపీని ‘కాపు’ కాస్తానంటున్న బీజేపీ.. కేంద్రం ప్రకటనతో ఇరుక్కున వైసీపీ!
Recommended Video: