Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Jail: చంద్రబాబుపై సెక్షన్లకు శిక్షలు ఇవే

Chandrababu Jail: చంద్రబాబుపై సెక్షన్లకు శిక్షలు ఇవే

Chandrababu Jail: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబును కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనపై సిఐడి మోపిన అభియోగాలు రుజువైతే పదేళ్లకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉందని.. జీవిత ఖైదు పడిన ఆశ్చర్యపోనవసరం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఆయన పై మోపిన సెక్షన్లు ఏమిటి? అవి రుజువైతే పడే శిక్షలు ఏమిటి? అనే దానిపై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి.

సిఐడి పోలీసులు చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత సిఆర్పిసి సెక్షన్ 50 (1)(2) కింద నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే చంద్రబాబు మీద సెక్షన్ 120 బి, 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రీడ్ విత్ 34, 37 ఐపిసి సెక్షన్లు నమోదు చేశారు. ఇవి కాకుండా 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు కింద కేసును రిజిస్టర్ చేశారు. ఈ తరుణంలో ఈ సెక్షన్లు ఏమిటి? అవి ఏం చెబుతున్నాయి అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇవి గాని రుజువైతే శిక్షలు ఇలా పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు ఈ విధంగా చెబుతున్నారు.

* 120 (బి):ఇది నేరపూరిత కుట్ర కిందకు వస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తితో కలిసి కుట్ర చేయడం. ఈ సెక్షన్ కింద గరిష్టంగా అయితే జీవిత ఖైదు, లేకుంటే రెండు సంవత్సరాలు, అంతకంటే ఎక్కువకాలం కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది.
* 166 సెక్షన్ : ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఉండి, చట్ట వ్యతిరేకంగా సంస్థకి లేదా ఒక వ్యక్తికి నష్టం చేసినప్పుడు ఈ సెక్షన్ కింద కేసు పెడతారు. నేరం రుజువైతే సంవత్సరం వరకు జైలు శిక్ష తో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది.
* 167 సెక్షన్: ప్రజా ప్రతినిధిగా ఉండి అధికారిక పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ పేపర్లను తారుమారు చేయడం. డూప్లికేట్ పత్రాలు తయారు చేయడం వల్ల వ్యక్తీ లేదా సంస్థకు నష్టం చేయడం. ఇందులో నేరం రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
* 418 సెక్షన్ : మోసం చేయడం, ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి అగ్రిమెంట్ ద్వారా నేరస్తులను రక్షించడం కోసం మోసానికి పాల్పడడం. నేరం రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.
* 420 సెక్షన్ : మోసం చేయడం, విలువైన వస్తువు లేదా ఇతరుల ఆస్తిని లాక్కోవడం. నేరం రుజువైతే గరిష్టంగా ఏడేళ్ల పాటు జైలు శిక్ష,జరిమానా విధిస్తారు.
* 465 సెక్షన్ : ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్. బెయిలబుల్ సెక్షన్ కిందకు వస్తుంది. రెండేళ్ల జైలు శిక్ష తో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది.
* 468 సెక్షన్ :డూప్లికేట్ పత్రము లేదా ఎలక్ట్రానిక్ పత్రం మోసం చేయడానికి ఉపయోగించాలని ఉద్దేశంతో ఫోర్జరీ చేయడం.ఈ సెక్షన్ కింద ఏడేళ్ల వరకు జైలు శిక్ష,జరిమానా విధించే అవకాశం.
* 471 సెక్షన్: నకిలీ పత్రమని తెలిసి.. మోసపూరితంగా ఆ పత్రాన్ని వినియోగించడం. ఇది బెయిలబుల్ సెక్షన్. మోసాన్ని బట్టి శిక్ష విధిస్తారు.
*409 సెక్షన్ : ప్రజా ప్రతినిధిగా, ప్రభుత్వ ఉద్యోగిగా, వ్యాపారిగా, బ్యాంకర్ గా, భాగస్తులుగా, బ్రోకర్ గా ఒక ఆస్తి పై బాధ్యత ఉన్నప్పుడు, ఆ బాధ్యతను మరచి నమ్మకద్రోహిగా వ్యవహరిస్తే ఈ సెక్షన్ వాడుతారు. నేరం రుజువైతే పదేళ్ల జైలు, జీవిత ఖైదు, జరిమానా విధించవచ్చు.
* 201 సెక్షన్ : నేరానికి సంబంధించిన ఆధారాన్ని తారుమారు చేయడం. నేర తీవ్రతను బట్టి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం.
* 109 రీడ్ విత్ 34, 37: ఏదైనా నేరాన్ని కావాలని చేయడం, నేరం చేసేటట్టు ప్రేరేపించడం. వీటికి నేర తీవ్రత బట్టి శిక్ష పడే అవకాశం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular