Chandrababu Arrest : ‘స్కిల్ డెవలప్ మెంట్’ అవినీతి ఆరోపణల కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు బెయిల్ కోసం ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నారు. రెండు మూడు రోజులుగా విచారణ పేరుతో అర్ధరాత్రి నుంచి పోలీసులు హింసించడంతో ఆయన తొలిరోజు జైల్లో నిన్న రాత్రి త్వరగా నిద్రపోయారు.
ఈ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆయన వాకింగ్, యోగా చేశారు. అనంతరం న్యూస్ పేపర్లు చదివారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆయన సహాయకుడు ఆయనకు అల్పాహారాన్ని అందించాడు.
టిడిపి అధినేత చంద్రబాబు ని కలిసేందుకు కుటుంబ సభ్యులు ములాఖత్ అనుమతి తీసుకున్నారు. చంద్రబాబు సతీమణి, భువనేశ్వరి కోడలు బ్రహ్మణి లు ఈరోజు మధ్యాహ్నం రాజమండ్రి కి చేరుకోనున్నారు. వీరికి సాయంత్రం నాలుగు గంటలకు ములాఖత్ కు జైలు అధికారులు అనుమతిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కార్యకర్తలతో నియోజకవర్గ ఇన్చార్జిల సమావేశం జరగనుంది. చంద్రబాబు అక్రమ అరెస్టు ను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి వాస్తవాలను వివరించేలా టిడిపి అధిష్టానం కార్యచరణ రూపొందించింది.
చంద్రబాబుకు జైల్లో స్నేహ బ్లాక్ మొత్తాన్ని చంద్రబాబుకు కేటాయించారు. బ్లాక్ లో ఒక ప్రత్యేక గదిని ఆయనకు ఇచ్చారు. చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని కోర్టు అనుమతించింది. చంద్రబాబు హౌస్ రిమాండ్ పై ఈ మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది..