https://oktelugu.com/

NDA Alliance: కొత్త ప్రభుత్వంలో టీడీపీ, జేడీయూ డిమాండ్లు ఇవే!?

కొత్తగా ఏర్పడే సంకీర్ణ సర్కార్‌లో టీడీపీ, జేడీయూ కీలకంగా మారాయి. ఈ రెండు పార్టీలు డబుల్‌ డిజిట్‌ సీట్లతో కీలకంగా మారాయి. ఈ పార్టీల మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీంతో ఈ పార్టీలకు కొత్త ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 6, 2024 5:10 pm

    NDA Alliance:

    Follow us on

    NDA Alliance: దేశంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరబోతోంది. బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చకచకా పనులు జరుగుతున్నాయి. జూన్‌ 8 నుంచి 10వ తేదీ మధ్య ఎప్పుడైనా కొత్త సర్కార్‌ కొలువుదీరే అవకాశం ఉంది. ఈమేరకు జూన్‌ 5 సమావేశమైన ఎన్డీఏ పక్షాలు ప్రధాని అభ్యర్థిగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంతోపాటు మరోమారు ఎన్‌డీఏ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానిగా మోదీని ఎన్నుకుంటారు.

    కూటమిలో టీడీపీ, జేడీయూ కీలకం..
    కొత్తగా ఏర్పడే సంకీర్ణ సర్కార్‌లో టీడీపీ, జేడీయూ కీలకంగా మారాయి. ఈ రెండు పార్టీలు డబుల్‌ డిజిట్‌ సీట్లతో కీలకంగా మారాయి. ఈ పార్టీల మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీంతో ఈ పార్టీలకు కొత్త ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    టీడీపీ కోరుతున్నవి..
    టీడీపీ కొత్త ప్రభుత్వం ముందు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అడుగుతోంది. దీంతోపాటు స్పీకర్‌ పదవితోపాటు, రెండు కేబినెట్‌ పదవులు అడుగుతోంది.

    జేడీయూ కోరుతున్న శాఖలు ఇవే..
    జేడీయూ కొత్త ప్రభుత్వంలో రైల్వే శాఖతోపాటు వ్యవసాయ శాఖను కోరుతోందట. కీలకమైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖ వంటి కీలక పదవులను మాత్రం బీజేపీ తనవద్దే ఉంచుకునే అవకాశం ఉంది