Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Jail: దేశంలో జైలుకు వెళ్లిన సీఎంలు, మాజీ సీఎంలు వీళ్లే!

Chandrababu Jail: దేశంలో జైలుకు వెళ్లిన సీఎంలు, మాజీ సీఎంలు వీళ్లే!

Chandrababu Jail: తెలుగుదేశం పార్టీ అధినేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు, విభజి ఏపీకి ఒకసారి ముఖ్యమంత్రిగా, మూడు పర్యాయాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో అరెస్ట్‌ అయ్యారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు అతడిని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. దేశంలో పలువురు ముఖ్యమంత్రులు… మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్‌ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అనేక కుంభకోణాలు, పలు కేసుల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నవారిని కూడా అరెస్ట్‌ చేశారు. మరికొందరిని ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక అరెస్ట్‌ చేశారు. ఎవరెవరు, ఎప్పుడెప్పుడు అరెస్ట్‌ అయ్యారోచూద్దాం.

– జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా గతంలో అరెస్ట్‌ అయ్యారు. మైనింగ్‌ కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్‌ అయ్యారు. అలాగే మనీలాండరింగ్‌ నిరోధక చట్టం 2002 కింద ఆయనపై కేసు నమోదైంది. మధు కోడా 2006 నుంచి 2008 వరకు జార్ఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.

– జార్ఖండ్‌ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శిబు సోరెన్‌ కూడా అరెస్ట్‌ అయ్యారు. శిబు సోరెన్‌ వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్‌ ఝా కిడ్నాప్, హత్యకు సంబంధించిన కేసులో శిబుసోరెన్‌ అరెస్ట్‌ అయ్యారు. ఆ తర్వాత ఇదే కేసులో ఢిల్లీ హైకోర్టు శిబు సోరెన్‌ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. శిబు సోరెన్‌.. 2005 ఒకసారి… 2008 నుంచి 2009 వరకు ఒకసారి, 2009 నుంచి 2010 వరకు ఒకసారి జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

– హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశం చౌతాలా కూడా జైలుకు వెళ్లారు. పాఠశాల ఉపాధ్యాయుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించిన స్కామ్లో ఓం ప్రకాశ్‌ చౌతాలా దోషిగా తేలడంతో.. ఆయన అరెస్ట్‌ అయ్యారు. ఓ ప్రకాశ్‌ చౌతాలా..1989, 1990, 1990 నుంచి 91, 1999 నుంచి –2005 వరకు సీఎంగా పనిచేశారు.

– బీహార్‌ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్‌యాదవ్‌ కూడా జైలుకు వెళ్లారు. పశువుల దాణా కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌యాదవ్‌కు శిక్ష పడింది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60 లక్షలు జరిమానా విధించింది. బీహార్‌కు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 1999 నుంచి 95 వరకు ఒకసారి, 1995 నుంచి 97 వరకు సీఎంగా విధులు నిర్వర్తించారు.

– తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా అరెస్ట్‌ అయ్యారు. చెన్నైలో ప్లయ్‌ఓవర్‌ నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. కానీ కోర్టు ఆయన్ను దోషిగా తేల్చలేదు. కరుణానిధి తమిళనాడుకుఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1969 నుంచి 1971, 1971 నుంచి 1976, 1989 నుంచి 1991, 1996 నుంచి 2001, 2006 నుంచి 2011 వరకు సీఎంగా విధులు నిర్వర్తించారు.

– తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలళిత కూడా అరెస్ట్‌ అయ్యారు. అక్రమాస్తుల కేసులో 2014 సెప్టెంబర్‌ 26 జయలలితను అరెస్ట్‌ చేశారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉండగా నేరం నిరూపణ కావడంతో బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.100 కోట్ల జరిమానా విధించింది. దీంతో ఆమె ఓ పన్నీర్‌సెల్వంను సీఎంగా నిలిపి జైలుకు వెళ్లారు. 1991 నుంచి 1996 వరకు, 2001 నుంచి 2002 వరకు, 2002 నుంచి 2006 వరకు 2015 నుంచి 2016 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

– కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా అరెస్ట్‌ అయ్యారు. మైనింగ్‌ స్కామ్క సంబంధించి పలు అవినీతి కేసుల్లో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. కర్ణాటకకు యడ్యూరప్ప రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2007 ఒకసారి, 2008 నుంచి 2011 వరకు మరోమారు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

– యూపీ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌ సింగ్‌ కూడా జైలుకు వెళ్లారు. ఎమెర్జెన్సీ టైంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయన్ను జైలులో వేశారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రత్యర్థులందరినీ జైలులో పెట్టారు. చరణ్‌ సింగ్‌ 1967 నుంచి 68, 1970లో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

– ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రిఅరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా జైలుకు వెళ్లారు. క్రిమినల్‌ పరువు నష్టం కేసులో ఆయన జైలుకు వెళ్లారు. కేజీవాల్‌ నితిన్‌ గడ్కరీపై ఆరోపణలు చేశారు. నితిన్‌ గడ్కరీ అవినీతిపరుడంటూ ఆరోపించారు. దీంతో నితిన్‌ గడ్కరీ కేజ్రివాల్‌ పై పరువునష్టం దావా వేశారు. అరవింద్‌ కేజీవాల్‌ గతంలో 2013 నుంచి 14 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

– తాజాగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా అరెస్ట్‌ అయ్యారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కుంభకోణం కేసులో ఆయన్ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో చంద్రబాబును కోర్టులో హాజరు పర్చగా ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి జైలుకు తరలించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular