2024లో గూగుల్ సెర్చ్‌లో నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన వ్యక్తులు వివిధ రకాల అంశాల వల్ల వారి గురించి సెర్చ్ చేశారు. కొందరి దారులు వేరు అయినా నెటిజన్లకు మాత్రం క్యూరియాసిటీ వచ్చేసింది. అయితే Google ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2024’ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం అత్యధికంగా శోధించిన టాప్ 10 వ్యక్తులను గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రాత్మక పునరాగమనంలో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ఈ జాబితాలో ఆధిపత్యం చెలాయించారు. అంటే ఈయన గురించి ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేశారు. ఈ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్నారు డోనాల్డ్ ట్రంప్. ఆయన గురించి చాలా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ 2వ స్థానంలో నిలిచారు. 2024 US ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయిన కమలా హారిస్ 3వ స్థానంలో నిలిచారు. అయితే అమెరికా ఎన్నికల సమయంలో ఆ దేశ ఎన్నికల రిజల్ట్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అందులో భాగంగానే వీరు ముందు స్థానంలో నిలిచారు. అమెరికా కు చెందిన ఈ ముగ్గురు కూడా మొదటి స్థానాల్లో నిలిచారు.
2024లో గూగుల్‌లో అత్యధికంగా శోధించిన వ్యక్తులలో అల్జీరియన్ బాక్సర్ ఇమానే ఖెలిఫ్, అవుట్‌గోయింగ్ యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ 4వ, 5వ స్థానంలో నిలిచారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, US వైస్ ప్రెసిడెంట్-ఎన్నికైన JD వాన్స్ కూడా సెర్చ్ ఇంజిన్‌లో ఆధిపత్యం చెలాయించారు. 6వ, 7వ స్థానాలను ఆక్రమించారు. 2024లో గూగుల్‌లో అత్యధికంగా శోధించిన వ్యక్తులలో స్పానిష్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి లామిన్ యమల్, యుఎస్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ 8, 9 స్థానాల్లో నిలిచారు.